Breaking News

పండగ వేళ జేబులో డబ్బు మిగలాలంటే..

Published on Tue, 10/20/2026 - 13:02

దసరా పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు, షాపింగ్, బహుమతులతో.. ఇంట్లో సందడి మొదలవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో భారీ డిస్కౌంట్లు కనిపించడంతో చాలామంది అవసరానికి మించి ఖర్చు చేస్తుంటారు. క్రెడిట్ కార్డులు, లోన్స్ ద్వారా కొనుగోళ్లు చేయడం వల్ల.. తరువాత అప్పుల భారం పెరిగిపోతుంది. అందుకే.. పండుగను ఆనందంగా జరుపుకుంటూనే, మన ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసం తప్పకుండా ఐదు నియమాలు పాటించడం మంచిది.

50-30-20 బడ్జెట్ నియమం
నెలవారీ ఆదాయాన్ని సరైన పద్ధతిలో విభజించుకోవడం చాలా ముఖ్యం. ఆదాయంలో 50 శాతం ఇంటి అద్దె, కిరాణా సరుకులు, ఈఎంఐలు వంటి అవసరాలకు, 30 శాతం షాపింగ్, వినోదం వంటి వ్యక్తిగత ఖర్చులకు, మిగిలిన 20 శాతం పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. పండుగ సమయంలో కూడా ఈ బడ్జెట్‌ను దాటకుండా చూసుకోవాలి. డిస్కౌంట్లు ఉన్నాయని అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయకుండా ఉంటే.. కొంత డబ్బు ఆదా అవుతుంది.

క్రెడిట్ కార్డు వాడకంపై నియంత్రణ
పండుగ ఆఫర్ల సమయంలో.. క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేయడం సాధారణమే. కొనేటప్పుడు బాగానే ఉంటుంది, చెల్లించేటప్పుడు కష్టం అవ్వొచ్చు. కాబట్టి.. తిరిగి చెల్లించగలిగిన మొత్తానికి మాత్రమే క్రెడిట్ కార్డును ఉపయోగించడం మంచిది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతం లోపే బకాయిని ఉంచుకోవడం మంచి అలవాటు. ఉదాహరణకు.. మీ కార్డు లిమిట్ రూ.3 లక్షలు ఉంటే, బకాయిని రూ.90 వేల లోపే ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. బిల్లులను గడువులోగా చెల్లించడం వల్ల, అదనపు వడ్డీ భారం తగ్గడంతో పాటు క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా చూడవచ్చు.

ఖర్చులకు ముందే బడ్జెట్ వేసుకోండి
దసరా షాపింగ్‌కు వెళ్లే ముందే ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. కొనాల్సిన వస్తువుల జాబితా తయారు చేసుకుని, నిజంగా అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. ఆఫర్లు కనిపిస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయకుండా, ఆ వస్తువు అవసరమా కాదా అని ఆలోచించండి. ఖర్చు చేసిన ప్రతి రూపాయిని లెక్కలో ఉంచుకుంటే బడ్జెట్ దాటకుండా చూసుకోవచ్చు. పండుగ ముగిసే సమయానికి అప్పులు మిగలకుండా ఉండటమే లక్ష్యంగా పెట్టుకోవాలి.

అత్యవసర నిధిని ఖర్చు చేయకండి
అనుకోకుండా వైద్య ఖర్చులు రావడం, ప్రమాదాలు జరగడం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. ఇలాంటి సమయాల్లో ఉపయోగపడేందుకు కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. ఉదాహరణకు.. నెలకు రూ.లక్ష ఖర్చవుతుంటే రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ప్రత్యేకంగా దాచుకోవడం మంచిది. ఈ మొత్తాన్ని పండుగ షాపింగ్, బహుమతులు లేదా ఇతర అనవసర ఖర్చుల కోసం ఉపయోగించకూడదు.

పొదుపు, పెట్టుబడులు
ఆదాయం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు, పెట్టుబడుల కోసం పక్కన పెట్టుకోవడం మంచి అలవాటు. బ్యాంకు పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ SIPలు వంటి మార్గాల్లో మీ అవసరాలు, రిస్క్‌ను బట్టి పెట్టుబడులు పెట్టవచ్చు. వీలైతే నిర్ణయించిన మొత్తాన్ని ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యేలా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల క్రమం తప్పకుండా పొదుపు చేయగలుగుతారు. పండుగ ఖర్చుల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను ఆపేయడం లేదా వాయిదా వేయడం మంచిది కాదు.

మొత్తం మీద.. దసరా పండుగను ఆనందంగా జరుపుకోవడానికి అనవసరంగా అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ముందుగానే బడ్జెట్ వేసుకోవడం, క్రెడిట్ కార్డులను బాధ్యతగా ఉపయోగించడం, అత్యవసర నిధిని కాపాడుకోవడం, క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా పండుగను ఆర్థిక ఒత్తిడి లేకుండా జరుపుకోవచ్చు. ఈ దసరా నుంచి మంచి ఆర్థిక అలవాట్లను ప్రారంభిస్తే భవిష్యత్తులో మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.

ఇదీ చదవండి: పండగ వేళ.. భారీగా తగ్గిన బంగారం ధర!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)