Breaking News

రూ.3 కోట్లు పెట్టి దుల్కర్‌ సల్మాన్‌ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?

Published on Sun, 04/16/2023 - 17:12

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోలు, కేరళకు చెందిన తండ్రీకొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్‌లకు కార్లంటే అమితమైన మోజు. వారి వద్ద పలు ప్రత్యేకమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. వారికి '0369 గ్యారేజ్' పేరుతో ప్రత్యేక కార్ల కలెక్షన్‌ ఉంది. అందులో కార్లన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్‌ 0369. తాజాగా ఈ గ్యారేజీకి సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు చేరింది. (ఐఫోన్‌ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్‌ పాత మోడళ్లు ఇవే..)

GLS 600 అనేది మెర్సిడెస్ బెంజ్‌ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ. ఈ కారు కంపెనీ అల్ట్రా-లగ్జరీ విభాగమైన మెర్సిడెస్-మేబ్యాక్ కిందకు వస్తుంది. 0369 గ్యారేజ్‌లోకి చేసిన GLS 600 మమ్మద్ కుట్టి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇది మమ్ముట్టి అసలు పేరు. మమ్ముట్టి కుమారుడు యువ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్ కలర్ GLS 600 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది.

ఇది కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసిన మొదటి మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు. తన అన్ని కార్ల మాదిరిగానే ఈ కారును కూడా మమ్ముట్టి 0369 నంబర్‌తో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ప్రత్యేక నంబర్‌ కోసం రూ.1.85 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇ​క మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు ధర సుమారు రూ. 2.92 కోట్లు (భారత్‌లో ఎక్స్-షోరూమ్ ధర).

దక్షిణ భారతదేశం నుంచి ఈ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారును కొన్న రెండో సినీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ఇతని కంటే ముందు తెలుగు హీరో రామ్ చరణ్ 2022లోనే ఈ కారును కొన్నారు. వీరితో పాటు అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రణ్‌వీర్ సింగ్, అనిల్ కపూర్, శిల్పా శెట్టితో సహా మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ కార్ కలెక్షన్‌లకు ఈ GLS 600ని జోడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)