Breaking News

ఇప్పుడు మరింత అందంగా మారిన వెస్పా.. కొత్త కలర్స్ అదుర్స్!

Published on Thu, 05/18/2023 - 21:33

Vespa Dual Tone: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ్ టూ వీలర్ తయారీ సంస్థ 'పియాజియో ఇండియా' తన అప్డేటెడ్ వెస్పా స్కూటర్ భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనమూ తెలుసుకుందాం.

వెస్పా డ్యుయల్ సిరీస్ పేరు విడుదలైన ఈ స్కూటర్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో సీటు, ఫుట్‌బోర్డ్‌ మాత్రమే కాకుండా పిలియన్ రైడ్‌ను అనుకూలంగా ఉండే రెస్ట్ కూడా కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది. 

వేరియంట్స్ & ధరలు:

  • పెర్ల్ వైట్ + అజురో ప్రోవెంజా కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 ధర రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు.
  • పెర్ల్ వైట్ + బీజ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్  విఎక్స్ఎల్ 125 రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు.
  • పెర్ల్ వైట్ + మ్యాట్ రెడ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు.
  • పెర్ల్ వైట్ + మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర)

(ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..)

కలర్ ఆప్షన్ కాకుండా ఈ స్కూటర్లలో పెద్దగా ఆశించిన మార్పుయ్లు లేదు. 125 సీసీ వేరియంట్ 7,000 rpm వద్ద 9.65 bhp పవర్, 5,600 rpm వద్ద 10.11 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 150 సీసీ వేరియంట్ 7,400 rpm వద్ద 10.64 bhp పవర్, 5,300 rpm వద్ద 11.26 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్లు రెండూ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందాయి. కావున ఉత్తమ పనితీరుని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)