Breaking News

ఇకపై అలాగైతేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌..

Published on Sat, 07/18/2026 - 13:47

సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణా శాఖ కఠినతరం చేసింది. రోడ్డు భద్రతా నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్న అభ్యర్థి ఇక నుంచి తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతపై మూడు గంటల పాటు వీడియో పాఠాలను చూసి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. వీడియో పాఠాలకు హాజరైన వారిని మాత్రమే  డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం నిర్వహించే ట్రాక్‌ టెస్టులకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని  ప్రయోగాత్మకంగా కూకట్‌పల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఫలితాలను అనుసరించి నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు.  

ముఖ కవళికల నమోదు ఉంటేనే..  
సాధారణంగా లెరి్నంగ్‌ లైసెన్స్‌ తీసుకున్న తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇస్తారు. ఇందుకోసం నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, తదితర డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లలో నిర్వహించే  పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే  లైసెన్స్‌ లభిస్తుంది. ఇక నుంచి ఈ రెండు పరీక్షలతో పాటు 3 గంటల వీడియో పాఠాలను చూసి రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకొని డ్రైవింగ్‌ టెస్ట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రవాణాశాఖ ఆధ్వర్యంలోని టీజీ ఆన్‌లైన్‌లో ఈ పాఠాలకు సంబంధించిన మాడ్యూల్స్‌ ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఈ పాఠాలను  వీక్షించే సమయంలో అభ్యర్థుల ముఖకవళికల నమోదు (ఫేస్‌ రికగ్నిషన్‌) తప్పనిసరి. అలాగే స్కూల్‌ జోన్లలో వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హారన్‌ మోగించాలి. ఆసుపత్రులు ఉన్న చోట హారన్‌ మోగించొద్దు. డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ తెలిసి ఉండాలి.  

రోజుకు 2,500 డ్రైవింగ్‌ టెస్టులు... 
ప్రస్తుతం నగరంలోని అన్ని టెస్ట్‌ ట్రాక్‌లలో నిత్యం 2,500 మందికిపైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కాగా.. కొన్ని చోట్ల ఎలాంటి పరీక్షలు లేకుండానే  డ్రైవింగ్‌ లైసెన్సులను జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ తాజాగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతా పాఠాలు సత్ఫలితాలిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)