Breaking News

ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!

Published on Fri, 06/26/2026 - 14:56

భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జూనో జనరల్ ఇన్సూరెన్స్ వారి 'ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026' దేశంలోని డ్రైవింగ్ అలవాట్లపై కీలకమైన విషయాలను వెల్లడించింది.

జూనో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన మొత్తం సమాచారం.. 17 రాష్ట్రాల్లో 45 లక్షల ప్రయాణాలు, 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటా ఆధారంగా రూపొందించారు.

ఈ నివేదిక ప్రకారం.. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య వాహనం నడపడం రోజులో అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎందుకంటే రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. అయితే.. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య డ్రైవింగ్ చేయడం అత్యంత సురక్షితమైన సమయంగా గుర్తించారు.

ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వయస్సు లేదా లింగం కాదు, డ్రైవింగ్ ప్రవర్తనే. భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా ప్రమాదాలు డ్రైవింగ్ అలవాట్ల వల్లే సంభవిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

మహిళలు పురుషుల కంటే తక్కువ నైపుణ్యంతో డ్రైవ్ చేస్తారనే అభిప్రాయాన్ని ఈ నివేదిక పూర్తిగా ఖండించింది. మహిళల సగటు డ్రైవింగ్ స్కోర్ 92.86 కాగా, పురుషుల స్కోర్ 92.43గా నమోదైంది. అంటే.. ఇద్దరి మధ్య భద్రత పరంగా పెద్దగా తేడా లేదని ఈ అధ్యయనం వెల్లడించింది.

భారతీయ డ్రైవర్లలో ప్రధాన బలహీనతలు ఆకస్మికంగా బ్రేక్ వేయడం, హఠాత్తుగా వేగం పెంచడం అని నివేదిక తెలిపింది. ఈ అంశాల్లో డ్రైవర్లు తక్కువ స్కోర్లు సాధించారు. అయితే వర్షాకాలం లేదా చలికాలం వంటి వాతావరణ మార్పులు డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా అధ్యయనం పేర్కొంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు మరణాల్లో దాదాపు 11 శాతం. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల కారణంగా భారత జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది.

రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా నష్టపోతున్నవారు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు. మొత్తం మరణాల్లో 44 శాతం ద్విచక్ర వాహనదారులు, 19 శాతం పాదచారులు ఉన్నారు.

భారతదేశంలో 2030 నాటికి రోడ్డు ప్రమాదాల మరణాలను 50 శాతం తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రహదారుల నిర్మాణం మాత్రమే సరిపోదని, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి సాంకేతికత ఆధారిత పరిష్కారాలు అవసరమని జునో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ షనాయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు.

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)