Breaking News

జీఎస్‌టీ షోకాజ్‌ నోటీసులపై బొంబాయి హైకోర్టుకు డ్రీమ్‌ 11 

Published on Wed, 09/27/2023 - 02:31

న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫారమ్‌ డ్రీమ్‌11 తన ప్లాట్‌ఫారమ్‌పై పెట్టిన పందాలపై రెట్రాస్పెక్టివ్‌ (గత లావాదేవీలకు వర్తించే విధంగా)గా  28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించడాన్ని సవాలు చేసింది. ఈ మేరకు జారీ అయిన షోకాజ్‌ నోటీసులపై బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్‌ ఉందని పిటిషన్‌లో డ్రీమ్‌11 పేర్కొంది.

‘‘అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం.. ఇలాంటి షోకాజ్‌ నోటీసు జారీ తగదు. పిటిషనర్‌ (డీ11) అందించిన ఆన్‌లైన్‌ ఫాంటసీ స్పోర్ట్స్‌ గేమింగ్‌ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినది.  జూదం లేదా బెట్టింగ్‌కు సంబంధించినది కాదు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా పన్ను డిమాండ్‌ నోటీసు రూ.40 వేల కోట్లని, రూ. 25 వేల కోట్లని మీడియాలో భిన్న కథనాలు రావడం గమనార్హం.

గేమింగ్‌ రంగంపై రెవెన్యూశాఖ దృష్టి! 
పన్ను వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం గేమింగ్‌ రంగంపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై నైపుణ్యం లేదా సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా 28 శాతం పన్ను విధించడం జరుగుతుందని జీఎస్‌టీ మండలి ఇటీవల ఇచ్చిన వివరణ ఈ పరిణామానికి నేపథ్యం.  రూ. 16,000 కోట్లకు పైగా జీఎస్‌టీ చెల్లింపుల్లో లోటుపై కాసినో ఆపరేటర్‌ డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు జీఎస్‌టీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,000 కోట్ల జీఎస్‌టీ రికవరీ కోసం ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీ గేమ్‌స్‌క్రాఫ్ట్‌కు ఇదే విధమైన షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. దీనిని రెవెన్యూశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్‌ 10వ తేదీన ఈ కేసు విచారణకు లిస్టయ్యింది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)