Breaking News

బయోసిమిలర్స్‌పై డాక్టర్‌ రెడ్డీస్‌ ఫోకస్‌

Published on Fri, 07/05/2024 - 06:15

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌.. అమెరికా తదితర మార్కెట్లలో దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికల్లో భాగంగా బయోసిమిలర్స్, డిజిటల్‌ సొల్యూషన్స్‌ మొదలైనవాటిపై మరింతగా దృష్టి పెట్టనుంది. మధ్యకాలికంగా ఇంజెక్టబుల్స్, సంక్లిష్టమైన ఓరల్‌ డోసేజీలు, ఓటీసీ బ్రాండ్లపైనా ఫోకస్‌ చేయనుంది. 2023–24 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. రాబోయే రోజుల్లో టాప్‌ 10 సంపన్న మార్కెట్లలో పలు బ్రాండ్లు ఎక్స్‌క్లూజివిటీని కోల్పోవడం వల్ల జనరిక్స్, బయోసిమిలర్ల వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉండగలవని తెలిపింది.

 నివేదిక ప్రకారం 2023 క్యాలండర్‌ సంవత్సరంలో 1.6 లక్షల కోట్ల (ట్రిలియన్‌) డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఫార్మా మార్కెట్‌ 2028నాటికి 2.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరగలదనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు, చికిత్సా ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా 2027 నుంచి ఏటా 3 వినూత్న సొల్యూషన్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. అప్పటికి 25 శాతం ఉత్పత్తులు మార్కె­ట్లో తొలిసారిగా ప్రవేశపెట్టేవే ఉంటాయని పేర్కొంది. 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు చేరు వ కావాలని నిర్దేశించుకున్నట్లు ప్రస్తుతం ఈ సంఖ్య సుమారు 70.4 కోట్లుగా ఉందని వివరించింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)