Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌కి పెట్టుబడుల దన్ను

Published on Fri, 08/15/2025 - 04:58

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను పటిష్టం చేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో మరో ప్రణాళికను సిద్ధం చేసినట్లు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో టెలికం శాఖ వెల్లడించింది. 4జీ సేవలను విస్తరించేందుకు 1 లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ గతేడాది రూ. 25,000 కోట్లు వెచి్చంచినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉటంకిస్తూ పేర్కొంది. 

వచ్చే ఏడాది నాటికి కస్టమర్లను పెంచుకుని, మొబైల్‌ సర్వీస్‌ వ్యాపారాన్ని 50 శాతం మేర పెంచుకోవాలని గత నెలలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి సూచించారు. ఎంటర్‌ప్రైజ్‌ వ్యాపారాన్ని 25–30 శాతం, ఫిక్స్‌డ్‌ లైన్‌ విభాగాన్ని కనీసం 15–20 శాతం మేర పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ)ని మెరుగుపర్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం సర్కిల్‌ని బట్టి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏఆర్‌పీయూ సుమారు రూ. 40 నుంచి రూ. 175 వరకు ఉంటోంది. జూన్‌ త్రైమాసికంలో ప్రైవేట్‌ టెల్కోలు రిలయన్స్‌ జియో ఏఆర్‌పీయూ రూ. 208గా, ఎయిర్‌టెల్‌ది రూ. 250గా నమోదైంది.   
 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)