Breaking News

జీఎస్‌టీ తగ్గింపుపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Published on Mon, 03/10/2025 - 18:05

పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరం. కాబట్టి, పరిశ్రమలు పన్నులను తగ్గించాలని నిరంతరం డిమాండ్ చేయకూడదని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు.

జీఎస్‌టీ, ఇతర పన్నులను తగ్గించమని అడగకూడదు, ఒకవేళా పన్నులను తగ్గిస్తే.. ఇంకా తగ్గించాలని చెబుతారు. ఎందుకంటే అది మానవ నైజం. పన్నులు వసూలు చేయకుండా.. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం కష్టం. ధనవంతుల నుంచి పన్ను తీసుకొని.. పేదలకు ప్రయోజనాలు కల్పించడం ప్రభుత్వ దార్శనికత అని గడ్కరీ అన్నారు.

రెండేళ్లలోపు భారతదేశంలోని లాజిస్టిక్స్ ఖర్చు 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు 14 నుంచి 16 శాతంగా ఉంది. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతంగా ఉంది. అమెరికా, యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతం అని మంత్రి అన్నారు. కాబట్టి మరో రెండేళ్లలో మన దేశంలో కూడా లాజిస్టిక్ ఖర్చులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. అంత కాకుండా పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతోందని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!

మీరు సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలు కూడా. ఈ స్వర్ణ యుగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాకుండా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)