Breaking News

పసిడి @ 1.38 లక్షలు

Published on Tue, 12/23/2025 - 04:38

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పుత్తడి, వెండి రేట్లు కొత్త రికార్డు స్థాయిలకు దూసుకెళ్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం సోమవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,685 మేర పెరిగింది. రూ. 1,38,200కి ఎగిసింది. అటు వెండి ధర కూడా కిలోకి రూ. 10,400 మేర పెరిగి మరో కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ. 2,14,500కి చేరింది. 

అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతుండటం, అక్కడి ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మరింతగా పసిడి, వెండివైపు మళ్లుతున్నారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) సౌమిల్‌ గాంధీ తెలిపారు. 

భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇటు పరిశ్రమల నుంచి అటు ఇన్వెస్ట్‌మెంట్‌ కోణం నుంచి డిమాండ్‌ నెలకొనడంతో వెండి రేట్లు పరుగులు తీస్తున్నట్లు కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌కి చెందిన ఫండ్‌ మేనేజర్‌ సతీష్‌ దొండపాటి చెప్పారు. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) ఒక దశలో 80.85 డాలర్లు పెరిగి 4,420.35 డాలర్లకు ఎగిసింది. వెండి సైతం 2.31 డాలర్లు పెరిగి ఔన్సుకి 69.45 డాలర్లు తాకింది.

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)