Breaking News

ఫ్లైట్‌ జర్నీ.. 1.43 కోట్ల మంది విమానమెక్కారు

Published on Thu, 05/22/2025 - 09:39

న్యూఢిల్లీ: దేశీయంగా ఏప్రిల్‌లో 1.43 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1.32 కోట్లతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 8.45 శాతం పెరిగింది. మార్కెట్‌ వాటాపరంగా చూస్తే 64.1 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఎయిరిండియా గ్రూప్‌ (27.2 శాతం), ఆకాశ ఎయిర్‌ (5 శాతం), స్పైస్‌జెట్‌ (2.6 శాతం) ఉన్నాయి. 

2025 జనవరి–ఏప్రిల్‌ మధ్యకాలంలో దేశీ విమానయాన సంస్థలు 5.75 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నెలవారీ రిపోర్టులో వెల్లడించింది. వార్షికంగా చూస్తే ఈ సంఖ్య 9.87 శాతం, నెలవారీగా చూస్తే 8.45 శాతం పెరిగినట్లు వివరించింది. 

సమయ పాలనపరంగా (ఓటీపీ) చూస్తే 80.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. 77.5 శాతం ఓటీపీతో ఆకాశ ఎయిర్, 72.4 శాతంతో ఎయిరిండియా గ్రూప్‌ .. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. స్పైస్‌జెట్‌ సమయ పాలన అత్యంత కనిష్ట స్థాయిలో 60 శాతంగా నమోదైంది.

Videos

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

Photos

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)