Breaking News

ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?

Published on Fri, 09/12/2025 - 15:53

భారతదేశంలో రాజ్యాంగ బద్దంగా.. రాష్ట్రపతి తరువాత రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి. ఈ బాధ్యతలను సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు శుక్రవారం(సెప్టెంబర్‌ 12వ తేదీ) చేపట్టారు. అయితే దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎటువంటి జీతం ఉండదని బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అయితే.. జీతం తప్ప, ఇతర ప్రోత్సాహకాలు లభించే ఏకైక పదవి ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.

భారత ఉపరాష్ట్రపతిగా ఎటువంటి జీతం తీసుకోనప్పటికీ.. ఈ పదవిలో ఉన్న వ్యక్తి, రాజ్యసభ ఛైర్మన్‌గా నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతారు ((2018లో దీనిని రూ.1,25,000 నుంచి సవరించారు). ఉపరాష్ట్రపతి జీతం, భత్యాలు పార్లమెంటు అధికారుల జీత భత్యాల 1953 చట్టం ప్రకారం నిర్ణయిస్తారు. ఇందులో ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేక జీత నిబంధన లేదు.

ఉపరాష్ట్రపతికి లభించే ప్రయోజనాలు
భారత ఉపరాష్ట్రపతికి జీతం లేకపోయినప్పటికీ.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉచిత వసతి, వైద్య సంరక్షణ, రైలు & విమాన ప్రయాణం, ల్యాండ్‌లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సర్వీస్, వ్యక్తిగత భద్రత, సిబ్బంది మొదలైనవి ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ

పదవీ విరమణ తరువాత కూడా అనేక సదుపాయాలు కల్పిస్తూ.. నెలకు సుమారు రూ. 2 లక్షల పెన్షన్, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్, సెక్యూరిటీ, డాక్టర్, ఇతర సిబ్బంది సేవలను పొందుతూనే ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి మరణించిన తరువాత.. ఆయన భార్యకు కూడా కొన్ని సదుపాయలను కల్పిస్తారు.

Videos

Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్

Global War: బాబా వంగా చెప్పిన ఈ 3 నిజమైతే ప్రళయమే!

Penna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది, పెన్నా నది

Appalaraju: ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తున్నారు

చంద్రబాబు బిస్కెట్ల కోసం బరితెగించిన ఈనాడు పత్రిక

మిజోరం రాజధానికి కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

Photos

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)