Breaking News

రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..

Published on Sat, 11/02/2024 - 09:40

భారతదేశంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాదిరిగానే.. పాకిస్థాన్‌లో అత్యంత సంపన్నుడు 'షాహిద్ ఖాన్' (Shahid Khan). బహుశా ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ జాక్సన్‌విల్లే జాగ్వార్‌, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఫుల్‌హామ్ ఎఫ్సీ వంటి వాటిని సొంతం చేసుకుని బాగా ఫేమస్ అయ్యారు. ఈయన కుమారుడు టోనీ ఖాన్, కుమార్తె షన్నా ఖాన్. కొడుకు తండ్రి బాటలో నడుస్తుంటే.. కుమార్తె మాత్రం దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.

షన్నా ఖాన్ (Shanna Khan) అమెరికాలోని ఇల్లినాయిస్‌లో.. సోదరుడు టోనీతో కలిసి పెరిగింది. ఈమె ప్రత్యేకమైన ప్యాకేజింగ్ డిజైన్ ఆర్గనైజేషన్ 'యునైటెడ్ మార్కెటింగ్ కంపెనీ'ని కూడా నిర్వహిస్తోంది. అటు వ్యాపారం, ఇటు సామజిక సేవ రెండింటిలోనూ తన నిబద్ధతను చాటుకుంటోంది.

షన్నా ఖాన్.. జాగ్వార్స్ ఫౌండేషన్ ద్వారా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఈమె తన కుటుంబంతో కలిసి గత ఏడాది యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వెటర్నరీ టీచింగ్ హాస్పిటల్‌కు ఏకంగా రూ.123 కోట్లు విరాళంగా అందించింది. ఇది యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.

పక్కన వాళ్లకు రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచించే వ్యక్తులున్న ఈ రోజుల్లో ఏకంగా రూ. 123కోట్లు దానం చేశారంటే.. వారి ఉదారత అనన్య సామాన్యం. దీన్ని బట్టి చూస్తే వారి దాతృత్వం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది.

ఇదీ చదవండి: 300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్

షన్నా ఖాన్.. వోల్ఫ్ పాయింట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'జస్టిన్ మెక్‌కేబ్‌'ను వివాహం చేసుకుంది. ఈమె ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఈమె షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ లక్ష కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. షన్నా ఖాన్ నికర విలువ, విరాళాలు మొత్తం కలిపినా అంబానీ ఫ్యామిలీ అంత ఉండకపోయినా.. ఉదారంగా విరాళాలు అందించడంలో వీరికి వీరే సాటి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)