Breaking News

రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్‌’ సంపద!

Published on Mon, 09/30/2024 - 17:44

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్‌ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్‌ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.

ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్‌ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉ‍న్నారు. జుకర్‌బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్‌ కార్పొరేషన్‌ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్‌ను వెనక్కినెట్టారు.

ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్‌

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం టాప్‌ 10 ధనవంతులు..

  1. ఇలోన్‌ మస్క్‌

  2. జెఫ్‌ బెజోస్‌

  3. బెర్నార్డ్ ఆర్నాల్ట్

  4. మార్క్‌ జూకర్‌బర్గ్‌

  5. లారీ ఎల్లిసన్‌

  6. బిల్‌గేట్స్‌

  7. లారీపేజ్‌

  8. స్టీవ్‌ బామర్‌

  9. వారెన్‌బఫెట్‌

  10. సెర్జీబ్రిన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)