Breaking News

ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?

Published on Sun, 03/30/2025 - 14:44

రోజుకు లక్షలమందిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తున్న ఇండియన్ రైల్వే గురించి దాదాపు అందరికీ తెలిసిందే. లెక్కకు మించిన ట్రైన్స్ దేశంలోని ప్రధాన భూభాగాలను కలుపుతూ ముందుకు సాగిపోతాయి. అయితే ఇంత పెద్ద నెట్‌వర్క్ కలిగిన భారతీయ రైల్వే రోజుకు ఎంత సంపాదిస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.

భారతీయ రైల్వే తమ సేవలను అప్డేట్ చేయడానికి మాత్రమే కాకుండా.. ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం.. రవాణా కోసం ప్రత్యేక కారిడార్ల నిర్మాణం చేపట్టడం వంటివి చేస్తోంది.

ఇండియన్ రైల్వే రోజుకు ఎంత ఆదాయం గడిస్తుంది అన్న ప్రశ్నకు.. రూ. 400 కోట్లు అని సమాధానం వస్తోంది. అంటే భారతీయ రైల్వే నెలకు రూ. 12వేల కోట్లు సంపాదిస్తున్నమాట. రైల్వేలు కేవలం ప్రజా రవాణాకు మాత్రమే కాకుండా.. సరుకు రవాణా చేయడానికి కూడా విరివిగా ఉపయోగపడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం సరుకును పంపించాలనుకునే కస్టమర్లు ట్రైన్ల ద్వారానే సరుకు రవాణా చేస్తారు.

ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం

సరుకు రవాణా రైళ్ల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, ప్యాసింజర్ రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా రైల్వేలకు చాలా ముఖ్యమైనది. రైల్వేలు ప్రతిరోజూ వేలాది ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నాయి. రైల్వేలు స్క్రాప్ అమ్మకాలు వంటి ఇతర వనరుల నుంచి కూడా ఆదాయాన్ని సంపాదిస్తాయి. పీఐబీ డేటా ప్రకారం, 22-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు సరుకు రవాణా ద్వారా రూ.1,60,158 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది.

భారతీయ రైల్వేలు ప్రపంచంలోని టాప్ 5 అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇండియన్ రైల్వే 7,308 కంటే ఎక్కువ స్టేషన్లను కలిగి.. రోజుకు 20 మిలియన్లకు పైగా ప్రయాణికులను తరలిస్తోంది. ప్రకటనలు, ప్లాట్‌ఫామ్ టికెట్స్ ద్వారా కూడా ఇండియన్ రైల్వే డబ్బు సంపాదిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)