Breaking News

ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?

Published on Mon, 04/07/2025 - 13:46

మనిషి దేన్నైనా సాధించాలని బలంగా అనుకుని ముందుకు సాగితే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుందని ఎంతోమంది చెప్పారు. ఉదాహరణలుగా కూడా నిలిచారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు టీమ్ ఇండియాకు ఓపెనర్ 'శుభ్‌మన్ గిల్' (Shubman Gill). సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గిల్.. కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథనంలో శుభ్‌మన్ ఆస్తి ఎంత? ఎలాంటి వాహనాలను వినియోగిస్తున్నారు, ఏ కంపనీలకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు, అనే వివరాలు తెలుసుకుందాం.

శుభ్‌మన్ గిల్ అంటే టీమిండియా క్రికెటర్ మాత్రమే కాదు యూత్ ఐకాన్ కూడా. రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇతను మొత్తం సంపద విలువ రూ. 32 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇతని వద్ద రూ. 89 లక్షల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్, రూ. 14.16 లక్షల ఖరీదైన మహీంద్రా థార్ ఉన్నాయి.

మహీంద్రా థార్ కారును ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌గా ఇచ్చారు. 2021 టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన సమయంలో ఆనంద్ మహీంద్రా ఆరుగురు ఆటగాళ్లకు మహీంద్రా థార్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గిల్ ఏడాదికి రూ. 5 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?

శుభ్‌మన్ గిల్‌ అనేక బ్రాండ్లకు అంబాసిడ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో CEAT, Nike, Dior, Fiama, Gilette వంటి బ్రాండ్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. కాగా ఈయనకు పంజాబ్‌లో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)