Breaking News

తండ్రి నుంచి అప్పు తీసుకున్న ట్రంప్‌!! కారణం ఏంటంటే..

Published on Sun, 11/03/2024 - 15:53

ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికావైపు చూస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలో ఎవరు గెలుస్తారు?. అగ్రరాజ్య ముఖచిత్రాన్ని మార్చేది ఎవరు? అనే దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మరోసారి వైట్‌హౌజ్‌ నుంచి పాలించాలని రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. రాజకీయాల్లోకి రాకముందు.. ట్రంప్‌ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజు అనే విషయం మీకు తెలుసా?.. 

డొనాల్డ్‌ ట్రంప్‌ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్ ట్రంప్‌కు నాలుగో సంతానం. 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక్ అకాడమీలో చేరాడు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పొందిన తరువాత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టడాని ముందే ట్రంప్ తన తండ్రి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకుని రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తరువాత తండ్రి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడంలో కీలక పాత్రం పోషించాడు. 1971లో కంపెనీని నియంత్రణలోకి తీసుకున్న తరువాత.. దానిని ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. ఆ తరువాత వివిధ వ్యాపారాలలోకి ప్రవేశించారు.

1973 నాటికి ట్రంప్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ట్రంప్ బ్రూక్లిన్, క్వీన్స్ & స్టాటెన్ ఐలాండ్‌లో 14,000 అపార్ట్‌మెంట్లను పర్యవేక్షించారు. 1978లో గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పక్కనే గ్రాండ్ హయత్ హోటల్‌ను అభివృద్ధి చేయడం కూడా ఈయన సారథ్యంలోనే జరిగింది. 1983లో మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని 58 అంతస్తుల 'ట్రంప్ టవర్'ను ట్రంప్ పూర్తి చేశారు. ఈయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఈ భవనంలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత.. ట్రంప్ సంస్థలోని అన్ని నిర్వహణ బాధ్యతలకు రాజీనామా చేసి, కంపెనీ నిర్వహణను తన కుమారులు డోనాల్డ్ జూనియర్, ఎరిక్‌లకు అప్పగించారు. కాగా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం కమలా హరిస్‌తో పోటీ పడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)