Breaking News

కాపీరైట్‌ కంటెంట్‌ వాడితే మూల్యం చెల్లించాల్సిందే..

Published on Mon, 06/23/2025 - 11:00

కృత్రిమ మేధ (ఏఐ) నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కాపీరైట్ కంటెంట్‌ను ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు కాపీరైట్ చట్టం నిబంధనలు పరిశీలించాలనేలా ఇటీవల కేంద్రం చూపిన చొరవను డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్‌పీఏ) స్వాగతించింది. ఈ వ్యవహారానికి సారథ్యం వహిస్తున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విభిన్న సోర్స్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీల్లో ప్రస్తుత కాపీరైట్ ఫ్రేమ్‌వర్క్‌లు ఎలా వర్తిస్తాయో అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ, సెర్చ్ అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రయోజనాల కోసం డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కంటెంట్‌ను అనుమతి లేకుండా ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎన్‌పీఏ తెలిపింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడే మెటీరియల్‌ కోసం కంటెంట్ ఉత్పత్తిదారులకు న్యాయమైన నష్టపరిహారాన్ని నిర్ధారించే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లు ఉండాలని పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి: అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సేవలు

దేశంలో డిజిటల్ న్యూస్ మీడియా వృద్ధికి ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యం అని డీఎన్‌పీఏ పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. లార్జ్‌ ల్యాంగ్వేజీ మోడళ్లు, ఏఐ ఆధారిత సెర్చ్‌ వేదికలు తరచూ జర్నలిజం మెటీరియల్‌పై ఎక్కువగా ఆధారపడుతున్న సమయంలో కంటెంట్ హక్కుల రక్షణ చాలా కీలకమని నొక్కి చెప్పింది. మెషీన్ లెర్నింగ్ వేగంగా వృద్ధి చెందుతున్న యుగంలో మేధో సంపత్తిని ఎలా కాపాడుకోవాలనే దానిపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, క్రియేటివ్‌ ఇండస్ట్రీ సంస్థలు ఆందోళనలు లేవనెత్తుతున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)