Breaking News

వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!

Published on Wed, 06/19/2024 - 11:55

పుర్రె భాగాన్ని స్కాన్‌చేసి వ్యక్తులను గుర్తించే ఏఐ సాంకేతికత ‘దివ్యదృష్టి’ను తయారు చేసినట్లు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తెలిపింది. డీఆర్‌డీఓ ఏర్పాటు చేసిన ‘డేర్‌ టు డ్రీమ్‌ ఇన్నోవేషన్‌ కంటెస్ట్‌ 2.0’లో ఈ టెక్నాలజీను ఆవిష్కరించిన ఇంజీనియస్ రిసెర్చ్‌ సొల్యూషన్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ విజేతగా నిలిచిందని చెప్పింది.

డీఆర్‌డీఓ తెలిపిన వివరాల ప్రకారం..‘దేశవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డేర్‌ టు డ్రీమ్‌ ఇన్నోవేషన్‌ కంటెస్ట్‌ 2.0ను ఏర్పాటు చేశాం. అందులో భాగంగా కొత్త ఏఐ టూల్‌ను పరిచయం చేసిన ఇంజీనియస్ రిసెర్చ్‌ సొల్యూషన్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ గెలుపొందింది. శివాని వర్మ అనే మహిళా వ్యాపారవేత్త ఈ కంపెనీను స్థాపించారు. సంస్థ తయారు చేసిన ‘దివ్యదృష్టి’ అనే ఏఐ టూల్‌ ద్వారా విభిన్న వ్యక్తులను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఇందులో భాగంగా మానవుల పుర్రె భాగాన్ని వివిధ శారీరక పరామితులను ఉపయోగించి స్కాన్‌ చేస్తారు. పుర్రె పరిమాణం, అందులోని ఇతర పరామితులు వ్యక్తులనుబట్టి మారుతాయి. దాంతో విభిన్న వ్యక్తుల ముఖాలను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. అ‍డ్వాన్స్‌డ్‌ బయోమెట్రిక్‌ సాంకేతికతను కూడా ఈ ‘దివ్యదృష్టి’లో ఉపయోగించారు.

కొత్తగా కనుగొన్న ఏఐ టూల్‌ను రక్షణ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, కార్పొరేట్, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా విభిన్న రంగాల్లో వినియోగించవచ్చని డీఆర్‌డీఓ తెలిపింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రోబోటిక్స్(సీఏఐఆర్‌) మార్గదర్శకత్వంతో ఈ టూల్‌ను కనుగొన్నట్లు ఇంజీనియస్ రిసెర్చ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది.

ఇదీ చదవండి: మార్కెట్‌ ట్రెండ్‌ గమనిస్తున్నారా? ఇప్పుడేం చేయాలంటే..

డిఫెన్స్ ఆర్ అండ్ డీ సెక్రటరీ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ..కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా డీఆర్‌డీఓ అనుసరిస్తున్న మార్గాలు అభినందనీయమన్నారు. ‘దివ్యదృష్టి’​ అభివృద్ధికి టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (టీడీఎఫ్) సహాయం చేయడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న ఫేస్‌ రికాగ్నిషన్‌ టెక్నాలజీలో కేవలం ముఖ కవలికలు, ముక్కు, కళ్లు, కనుబొమ్మలు.. వంటి భాగాలను స్కాన్‌ చేసి వ్యక్తులను గుర్తిస్తున్నారు. అయితే దాదాపు ఒకేలా ఉన్న వ్యక్తులను ఈ టెక్నాలజీతో కనిపెట్టడం కొంత కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చిన ‘దివ్యదృష్టి’ ఏకంగా పుర్రె భాగాలను స్కాన్‌ చేస్తుంది కాబట్టి మరింత కచ్చితత్వంతో కనిపెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)