కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్స్ చూడండి!

Published on Mon, 07/10/2023 - 20:53

భారతదేశంలో త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు మహీంద్రా, మారుతి సుజుకి కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా కంపెనీ తన థార్ 4x4, బొలెరో, బొలెరో నియో, మరాజో, ఎక్స్‌యువి300 వంటి కార్ల మీద డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కనిష్టంగా రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ ఎంచుకునే వేరియంట్, ఇంజిన్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది.

(ఇదీ చదవండి: హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?)

మారుతి సుజుకి విషయానికి వస్తే.. కంపెనీ ఈ నెలలో నెక్సా మోడల్స్ అయిన ఇగ్నిస్, సియాజ్, బాలెనో మీద రూ. 64,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, డిజైర్ మీద కూడా కంపెనీ రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది.

(ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!)

మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలు అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ బెనిఫిట్స్ స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని అధికారిక డీలర్‌షిప్ సందర్శించవచ్చు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)