Breaking News

టెక్కీలకు డైరెక్ట్ ఏసీ బస్‌

Published on Mon, 07/13/2026 - 12:47

ఐటీ కారిడార్ బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ నరకం చూసే టెక్కీలకు, ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. తుమకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ‘ఎలక్ట్రానిక్స్ సిటీ’ మధ్య ప్రయాణించే వందలాది మంది ఉద్యోగుల కోసం బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) సరికొత్త ‘విస్తారా ఏసీ బస్సు’ సేవలను ప్రారంభించింది.

బీఎంటీసీ లాంగ్‌ రూట్

దాదాపు 101 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రత్యేక రూట్ ప్రస్తుతం బీఎంటీసీ నడుపుతున్న బస్సు సర్వీసులన్నింటిలోకి అత్యంత పొడవైనది కావడం విశేషం. గ్రేటర్ బెంగళూరు పరిధి దాటి సుమారు 40 కిలోమీటర్ల పరిధి వరకు బస్సులు నడుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో.. స్థానికంగా ఉన్న శాటిలైట్‌ టౌన్స్‌ను అనుసంధానిస్తూ బీఎంటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

‘ప్రజా డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ సరికొత్త ఏసీ సర్వీస్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం తుమకూరు - ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణికుల ఆదరణ చాలా బాగుంది. గతంలో మేము నైలామంగళ, హోస్కోట్ మధ్య 80 కిలోమీటర్ల రూట్‌ను ప్రారంభించాం. ఇప్పుడు ఈ 101 కిమీ రూట్ మా నెట్‌వర్క్‌లోనే అతి పెద్దది’ అని బీఎంటీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (ఆపరేషన్స్) జి.టి. ప్రభాకర్ రెడ్డి అన్నారు.

ప్రయాణ సమయం, టైమింగ్స్‌ వివరాలు

ఈ సరికొత్త సర్వీస్ ద్వారా ప్రయాణికులకు నిత్యం 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు ప్రయాణ సమయం ఆదా అవుతోంది. ఉదయం 7:45 గంటలకు తుమకూరులో బయలుదేరి, ఉదయం 9:45 గంటల వరకు ఎలక్ట్రానిక్స్ సిటీకి చేరుకుంటుంది. (ఆఫీస్ వేళలకు సరిగ్గా సరిపోయేలా రూపకల్పన చేశారు). ఎలక్ట్రానిక్స్ సిటీ నుంచి సాయంత్రం ఐటీ ఉద్యోగుల లాగ్-అవుట్ సమయానికి అనుగుణంగా సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:00 గంటల కల్లా తుమకూరు చేరుకుంటుంది. వన్‌వే రూట్‌లో ప్రయాణ ఛార్జీ రూ.200గా నిర్ణయించారు. ప్రధాన స్టాపులు.. తుమకూరు, నేలమంగళ, మాదవర మీదుగా ‘నైస్ రోడ్’ ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్స్ సిటీ చేరుకుంటుంది.

ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..

#

Tags : 1

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)