Breaking News

చైనా యాప్‌లపై కేంద్రం కొరడా.. ఈసారి ఏకంగా

Published on Sun, 02/05/2023 - 13:22

న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌ డ్రాగన్‌ కంట్రీకి భారీ షాకిచ్చింది. దేశంలో ఒకేసారి 232 చైనా యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను  ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. నిషేధం విధించిన వాటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 98 లోన్ యాప్‌లు ఉన్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాల ప్రకారం వీటిని బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

చైనా లింకులు కలిగి ఉన్నట్లు గుర్తించడంతో ఈ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎంహెచ్‌ఏ (MHA).. ఆరు నెలల క్రితం 28 చైనీస్ లోన్ లెండింగ్ యాప్‌లపై నిఘా పెట్టింది. అయితే, ఈ-స్టోర్‌లలో 94 యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నాయని గుర్తించింది. అంతేకాకుండా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఈ చైనీస్ యాప్‌లపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఈ తరహా పలు చైనీస్ యాప్‌లను కేంద్రం బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 2020 నుంచి టిక్‌ టాక్‌, షేర్‌ఇట్‌, వీ చాట్‌, హలో, లైకీ, యూసీ న్యూస్‌, బిగో లైవ్‌, యూసీ బ్రౌజర్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ఫ్లోరర్‌, ఎంఐ కమ్యూనిటీ వంటి ప్రముఖ అప్లికేషన్‌లతో సహా 200కి పైగా చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.

చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా?

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)