Breaking News

ఊపందుకున్న పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు

Published on Tue, 04/18/2023 - 08:00

న్యూఢిల్లీ: వ్యవసాయ పనులు, పరిశ్రమల అవసరాలు, ట్రక్కుల ద్వారా రవాణా పెరగడంతో ఏప్రిల్‌ ప్రథమార్ధంలో డీజిల్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్‌ ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి డీజిల్‌ విక్రయాలు 15 శాతం పెరిగి 3.45 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. నెలలవారీగా చూసినప్పుడు మార్చి ప్రథమార్ధంలో నమోదైన 3.19 మిలియన్‌ టన్నులతో పోలిస్తే 8.4 శాతం పెరిగాయి.

ఇక పెట్రోల్‌ విషయానికొస్తే ఏప్రిల్‌ 1–15 మధ్య కాలంలో అమ్మకాలు 2 శాతం పెరిగి 1.14 మిలియన్‌ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే మాత్రం 6.6 శాతం మేర తగ్గాయి. కోవిడ్‌ పూర్వంతో (2020) పోలిస్తే ఏప్రిల్‌ ప్రథమార్ధంలో పెట్రోల్‌ అమ్మకాలు 128 శాతం, డీజిల్‌ అమ్మకాలు 127 శాతం పెరిగాయి. వార్షికంగా వంట గ్యాస్‌ విక్రయాలు 5.7 శాతం పెరిగి 1.1 మిలియన్‌ టన్నులకు చేరాయి.

మరోవైపు, ఏవియేషన్‌ కార్యకలాపాలు తిరిగి యథాప్రకారం ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌ ప్రథమార్ధంతో పోలిస్తే తాజాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) అమ్మకాలు 14 శాతం పెరిగి 2,84,600 టన్నులకు చేరాయి. నెలలవారీగా చూస్తే 3.8% తగ్గినప్పటికీ.. 2020తో పోల్చినప్పుడు 468 శాతం పెరిగాయి. పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకోవడం దేశీయంగా ఆయిల్‌ డిమాండ్‌కు ఊతమిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటు సర్వీసులు, అటు పరిశ్రమల నుంచి మద్దతుతో భారత్‌ స్థిరమైన వృద్ధి సాధించగలుగుతోందని పేర్కొన్నాయి.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)