Breaking News

వజ్రాల పరిశ్రమ పునరుజ్జీవం

Published on Wed, 01/22/2025 - 08:46

న్యూఢిల్లీ: కట్‌ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ‘డైమండ్‌ ఇంప్రెస్ట్‌ ఆథరైజేషన్‌ స్కీమ్‌’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశ్యాలుగా ఉన్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.

తాజా పథకం ఈ ధోరణికి చెక్‌పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా భారత వజ్రాల పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్‌ఎంఈలకు తగిన అవకాశాలను కల్పిస్తుందని తెలిపింది. మరిన్ని ఉపాధి అవకాశాలకు మార్గం కల్పిస్తుందని పేర్కొంది. రెండు స్టార్ల ఎగుమతి హోదా కలిగి, ఏడాదిలో 15 మిలియన్‌ డాలర్లు అంతకంటే అధిక విలువ మేర ఎగుమతులు చేస్తున్న సంస్థలు ఈ పథకం కింద ప్రయోజనానికి అర్హులని వెల్లడించింది.

ఇదీ చదవండి: భారత్‌ క్రెడిట్‌ రేటింగ్‌కు సవాళ్లు

25 క్యారట్‌ (25 సెంట్లు) అంతకంటే తక్కువ ఉన్న సహజ కట్, పాలిష్డ్‌ వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు పథకం అనుమతిస్తుందని స్పష్టం చేసింది. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) అనే స్వతంత్ర సంస్థ గణాంకాల ప్రకారం.. 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 14 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి. కట్, పాలిష్డ్‌ వజ్రాల ఎగుమతులు ఇదే కాలంలో 24.4 బిలియన్‌ డాలర్ల నుంచి 13.1 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)