Breaking News

రూ.కోట్లు కరిగిస్తున్న ‘షుగర్‌’!

Published on Fri, 11/14/2025 - 18:10

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న జబ్బు మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతోంది. డయాబెటిస్‌ ఒక కుటుంబానికి కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. ఆర్థిక సమస్య కూడా. మధ్యతరగతి కుటుంబంలో ఒకరికి షుగర్జబ్బు వస్తే వైద్య ఖర్చులకే కుటుంబ ఆదాయంలో 10 నుంచి 20 శాతం వరకు ఖర్చవుతోంది. ఇంట్లో ఒక్కరికి డయాబెటిస్‌ వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతుంది.. వైద్యపరంగా సగటున ఎంత ఖర్చు వస్తుంది.. తాజా డేటాతో సమగ్ర కథనం..

భారతదేశంలో డయాబెటిస్‌ ఒక కుటుంబానికి పెద్ద ఆర్థిక భారంగా మారుతోంది. సగటున ఒక రోగి చికిత్స, మందులు, పరీక్షలు, ఇన్సులిన్‌ మొదలైన వాటికి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతోంది. దేశవ్యాప్తంగా డయాబెటిస్‌ కేర్ మార్కెట్ విలువ 2024లో రూ.1.25 లక్షల కోట్లు ఉండగా, అది 2030 నాటికి రూ.1.87 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.

మధుమేహంతో ఆర్థిక ఇబ్బందులు ఇలా..

డయాబెటిస్‌ ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం మందులు, పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్లు అవసరం. ఇది నెలవారీ స్థిర ఖర్చుగా మారుతుంది. ప్రత్యేక డైట్‌ ఫుడ్‌, షుగర్‌-ఫ్రీ ఉత్పత్తులు, గ్లూకోమీటర్లు వంటి వస్తువులు అదనపు ఖర్చు పెంచుతాయి. జబ్బు కారణంగా రోగి పని సామర్థ్యం తగ్గితే కుటుంబ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంకా డయాబెటిస్‌ వల్ల హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, కంటి సమస్యలు వస్తే అదనపు వైద్య ఖర్చులు పెరుగుతాయి.

సగటు వైద్య ఖర్చులు

మధుమేహం బారిన పడిన వ్యక్తి మందులు, ఇన్సులిన్‌ కోసం నెలకు రూ.1,000 నుంచి రూ.4 వేలు.. అంటే సంవత్సరానికి రూ.12 వేల నుంచి రూ.48 వేలు ఖర్చవుతోంది. ఇక HbA1c, బ్లడ్‌ షుగర్‌, లిపిడ్‌ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం సంవత్సరానికి రూ.3వేల నుంచి రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డాక్టర్‌ కన్సల్టేషన్లకు సంవత్సరానికి రూ.2 వేల నుంచి రూ.5 వేలు, అదే జబ్బు కాస్త ముదిరితే కిడ్నీ డయాలిసిస్‌, హృదయ శస్త్రచికిత్స వంటి చికిత్సల కోసం రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటోంది.

Videos

హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

బెట్టింగ్ యాప్ కేసులో రానాను విచారిస్తున్న సీఐడీ

విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)