Breaking News

ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా

Published on Sun, 02/02/2025 - 12:10

ప్రభుత్వ నియంత్రణ నిబంధనలు పాటించనందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా విధించారు. నియమాలకు విరుద్ధంగా విమానాన్ని నడపడానికి పైలట్‌ను అనుమతించినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పదేపదే రోస్టరింగ్ సమస్యలు, పైలట్లకు తప్పనిసరి రికెన్సీ(విమానాలను నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా చేయడం) ఉల్లంఘనలకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అయితే అందుకు సరైన విధంగా స్పందించకపోవడం వల్ల ఈ జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.

ప్రతి పైలట్ నిత్యం మూడు టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు చేయాల్సిన అవసరం లేనప్పటికీ  జులై 7, 2024న విమానాన్ని నడపడానికి ఎయిరిండియా ఒక పైలట్‌ను అనుమతించిందని డీజీసీఏ గుర్తించింది. పైలట్‌ విమానం నడపడానికి ముందు ఎయిరిండియా రోస్టింగ్ కంట్రోలర్లు సీఏఈ విండోలో ప్రతిబింబించే అనేక హెచ్చరికలను పట్టించుకోలేదని డీజీసీఏ ఎత్తిచూపింది. కంపెనీ చర్యలను హైలైట్‌ చేస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కానీ సంస్థ ఇచ్చిన ప్రతిస్పందనతో డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. 

ఇదీ చదవండి: చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లు

జనవరి 29, 2025న రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు ఇటీవల పేర్కొంది. 30 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ఎయిరిండియాను ఆదేశించింది. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నొక్కి చెప్పింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)