Breaking News

పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!

Published on Sat, 04/26/2025 - 15:33

సాక్షి, సిటీబ్యూరో: కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్‌ ఉంది.

ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండంతో సప్లయ్ తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్‌ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్‌లో డిమాండ్‌ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.

పశ్చిమంలో డిమాండ్‌ ఎక్కువ.. 
గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్‌ అధికంగా ఉంది.

ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)