Breaking News

రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు య‌మ క్రేజ్‌.. త్వ‌ర‌ప‌డండి

Published on Wed, 07/16/2025 - 17:53

సాక్షి, హైద‌రాబాద్‌: మధ్యతరగతి ప్రజలకు సొంతింటి వసతిని కల్పించేందుకు లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకు అందుబాటులో తెచ్చిన ఫ్లాట్ల కొనుగోలుకు హైద‌రాబాద్‌ నగరవాసుల ఆసక్తి పెరుగుతోందని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ సి.భాస్కర్‌ రెడ్డి తెలిపారు. నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని ఫ్లాట్ల మార్కెట్‌ ధర కంటే దాదాపు 40 శాతం తక్కువకే అందుబాటులో ఉన్నాయన్నారు.

నాగోల్‌ (Nagole) బండ్లగూడలోని 159 ఫ్లాట్లకు, పోచారంలోని 601 ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్‌ విడుదలైనట్లు తెలిపారు. నాగోల్‌ బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం సుమారు 12 వందల మంది ఫోన్లు చేయగా, 700 మంది ప్రాజెక్టును సందర్శించినట్లు తెలిపారు. పోచారం (Pocharam) ఫ్లాట్లకు సంబంధించిన 800 మంది వరకు టెలిఫోన్‌లో సంప్రదించగా, సుమారు 300 మంది వరకు ప్రాజెక్టును సందర్శించారన్నారు.

బండ్లగూడ (Bandlaguda) ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 29 వరకు స్వీకరిస్తామని, 30వ తేదీన లాటరీ ద్వారా కేటాయిస్తామని, పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు స్వీకరిస్తామని, ఆగస్టు 1వ తేదీన లాటరీ ద్వారా కేటాయిస్తామని ఆయన వివరించారు. అతితక్కువ ధరల్లోనే సొంతింటి కలను నెరవేరేలా ప్రభుత్వం కలి్పంచిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చ‌దవండి: ఇల్లు కొంటున్నారా?.. ఇలాంటి లొసుగుల‌తో జాగ్ర‌త్త‌!  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)