Breaking News

ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్‌ రిస్కులు!

Published on Thu, 12/19/2024 - 09:26

న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హ్యాకింగ్, సైబర్‌ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు. డెలాయిట్‌ ఏషియా పసిఫిక్‌ రూపొందించిన ‘ఏఐ ఎట్‌ క్రాస్‌రోడ్స్‌’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే ఇంటికి ఆటో స్పేర్‌పార్ట్స్‌

  • ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్‌ వర్కర్లు తెలిపారు.

  • గవర్నెన్స్‌పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్‌ వివరించింది.

  • ఏఐ వినియోగంపై కంపెనీలకు ఆశావహ భావం కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

  • నైతిక విలువలతో ఏఐను వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని తెలిపింది.

  • ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది.

  • విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న టెక్‌ కంపెనీలకు సంబంధించిన 900 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు.
     

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)