Breaking News

ఉద్యోగిని తొలగించారు సరే.. ఆధారాలేవి?

Published on Sat, 07/19/2025 - 08:29

ఒక మాజీ ఉద్యోగి తొలగింపు లేఖ పరువు నష్టం కలిగించేలా ఉందని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఆ వ్యక్తికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ను ఆదేశించింది. విప్రో మాజీ ఉద్యోగి అభిజిత్ మిశ్రా రూ.2.1 కోట్ల నష్టపరిహారం కోరుతూ తన తొలగింపు లేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశాడు. జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.

51 పేజీల తీర్పులో హైకోర్టు కొన్ని అంశాలను పేర్కొంది. ఎలాంటి ఆధారం లేని తొలగింపు లేఖలు ఉద్యోగుల పరువు నష్టం కిందకు వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. లేఖలో ‘దురుద్దేశపూరిత ప్రవర్తన’ అనే పదాన్ని కంపెనీ చేర్చింది. అయితే అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో వెల్లడించలేదని ధర్మాసనం తెలిపింది. ఇది పిటిషనర్ భవిష్యత్తు ఉపాధి, వృత్తిపరమైన గౌరవంపై ప్రత్యక్ష, హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్‌ ఇండియాలోనే..

మిశ్రా విప్రోలో ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుండేవాడు. జూన్ 5, 2020న కంపెనీ టర్మినేషన్‌ లేఖ పంపించింది. అందులో మిశ్రా ప్రవర్తన దురుద్దేశపూర్వకంగా ఉందని, ఇది యజమాని-ఉద్యోగి సంబంధంలో విపత్కర పరిస్థితులకు దారితీసిందని పేర్కొంది. వీటిని సవాలు చేస్తే మిశ్రా ఆ లేఖలో తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయని, ఇది తన వ్యక్తిత్వాన్ని కించపరిచిందని, తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని కోర్టులు పిటిషన్‌ దాఖలు చేశాడు.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)