Breaking News

రూ.84 లక్షల బెంజ్‌ కారు.. రూ.2.5 లక్షలకే..

Published on Thu, 07/03/2025 - 15:48

ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్‌యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.

దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్‌ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.

రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్‌ రోవర్‌ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.  ‘నేను రేంజ్‌ రోవర్‌ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్‌. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్‌ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్‌ ఉంది. ఎన్‌సీఆర్‌లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్‌సీఆర్‌ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)