Breaking News

ఇల్లే ప్రపంచం.. అందుకే వీటికి డిమాండ్!

Published on Sun, 11/30/2025 - 06:30

కరోనా కంటే ముందు ఇల్లు అంటే నాలుగు గోడల భవనం. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేద తీరాలనుకునే గూడు. కానీ, కరోనా తర్వాత నుంచి ఇల్లే ప్రపంచమైపోయింది. తినడం, పడుకోవటం మాత్రమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ.. ఇంటి నుంచే ఫలితంగా కోవిడ్‌ కంటే ముందు హాట్‌ కేకుల్లాంటి స్టూడియో అపార్ట్‌మెంట్లకు.. క్రమంగా డిమాండ్‌ పడిపోయింది. వీటి స్థానంలో విస్తీర్ణమైన గృహాలకు గిరాకీ పెరిగింది.

బెడ్‌ కం లివింగ్‌ రూమ్, కిచెన్, అటాచ్‌డ్‌ బాత్‌రూమ్‌ ఉండే వాటాని స్టూడియో అపార్ట్‌మెంట్‌ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ తరహా అపార్ట్‌మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్‌మెంట్ల ట్రెండ్‌ క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

2013లో 7 ప్రధాన నగరాలలో 2,102 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్‌మెంట్లున్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్‌లు లాంచింగ్‌ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్‌మెంట్లే..

లొకేషన్‌ ముఖ్యం..
స్టూడియో అపార్ట్‌మెంట్లను బ్యాచ్‌లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్‌ ఆధారంగా డిమాండ్‌ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాలు చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కరోనా కారణంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్‌ పెరిగిందన్నారు. స్టూడియో అపార్ట్‌మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్‌ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణే నగరాలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్‌ నడుస్తోంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)