Breaking News

భారత్‌ నుంచి 3 బిలియన్‌ డాలర్ల కొనుగోళ్లు

Published on Wed, 07/30/2025 - 06:16

న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో (2030 నాటికి) తమ గ్లోబల్‌ కార్యకలాపాల కోసం భారత్‌ నుంచి కొనుగోళ్లను 3 బిలియన్‌ డాలర్లకు పెంచుకోనున్నట్లు (సుమారు రూ. 25,500 కోట్లు) ఫ్రాన్స్‌కి చెందిన స్పోర్ట్స్‌ రిటైలింగ్‌ సంస్థ డెకాథ్లాన్‌ తెలిపింది. తాము గత 25 ఏళ్లుగా భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నామని, మేకిన్‌ ఇండియా విజన్‌కి కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రొడక్షన్‌ హెడ్‌ ఫ్రెడరిక్‌ మెర్లివీడ్‌ తెలిపారు. ప్రస్తుతం తాము అంతర్జాతీయంగా జరిపే కొనుగోళ్ల పరిమాణంలో భారత్‌ వాటా 8 శాతంగా ఉందని, 2030 నాటికి దీన్ని 15 శాతానికి పెంచుకోనున్నామని చెప్పారు. 

భారత్‌లో విక్రయాల పరిమాణంలో 70 శాతం వాటా దేశీ సోర్సింగ్‌దే ఉంటోందని, దీన్ని 90 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. నాణ్యత, వేగం, కొత్త ఆవిష్కరణలపరంగా భారత్, తమ గ్లోబల్‌ తయారీ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోందని ఫ్రెడరిక్‌ చెప్పారు. డెకాథ్లాన్‌కి భారత్‌లో ఒక డిజైన్‌ సెంటర్, 83 సరఫరాదార్లు, 113 తయారీ యూనిట్లు, 55 నగరాల్లో 132 స్టోర్స్‌ ఉన్నాయి. రిటైల్, తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ.933 కోట్లు (100 మిలియన్‌ యూరోలు) ఇన్వెస్ట్‌ చేస్తామని కంపెనీ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెకాథ్లాన్‌ భారత మార్కెట్లో రూ. 4,000 కోట్ల ఆదాయం, రూ. 197 కోట్ల లాభం ఆర్జించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)