Breaking News

FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఫాస్టాగ్‌ కేవైసీ గడువు పొడిగింపు

Published on Thu, 02/01/2024 - 18:31

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్‌ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్‌ గడువును పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్‌ అకౌంట్లకు ఫిబ్రవరి 29వ తేదీలోపు  కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్‌ కోసం గతంలో విధించిన గడువు జనవరి 31తో ముగియగా ఎన్‌హెచ్‌ఏఐ మరోసారి పొడిగించింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయమైన టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్‌హెచ్‌ఏఐ తెలియజేసింది. కమర్షియల్ లేదా ప్రైవేట్ వాహనాలు ఉన్నవారు ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలను నివారించడానికి వెంటనే కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 29 గడువులోపు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌ పనిచేయకుండాపోవచ్చు.

 

కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ వంటి ప్రూఫ్స్‌తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. అదనంగా, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌లు వంటివి చిరునామా రుజువు ప్రక్రియకు అవసరం. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)