Breaking News

సెమీకండక్టర్ల తయారీలోకి సైయెంట్‌

Published on Wed, 04/09/2025 - 03:40

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీ టెక్నాలజీ దిగ్గజం సైయెంట్‌ తాజాగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ’సైయెంట్‌ సెమీకండక్టర్స్‌’ పేరిట ప్రత్యేక కంపెనీని ప్రారంభించింది. దీనిపై 100 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ కృష్ణ బోదనపు వెల్లడించారు. దీనికి సుమన్‌ నారాయణ్‌ సీఈవోగా వ్యవహరిస్తారని తెలిపారు. 

దేశవిదేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీలు, డిస్కంలు సహా వివిధ పరిశ్రమలకు అవసరమైన సిలికాన్‌ చిప్‌ సొల్యూషన్స్‌ను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు కృష్ణ వివరించారు. కంపెనీ విస్తరణ కోసం సెపె్టంబర్‌ నాటికి ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు కృష్ణ వివరించారు. ఇందుకోసం మర్చంట్‌ బ్యాంకర్లను నియమించుకునే ప్రక్రియపై కొనసాగుతోందన్నారు.  

ఇలా సమీకరించిన నిధుల్లో సింహభాగం వాటా పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలు, నిపుణుల నియామకాలపై వెచ్చించనున్నట్లు కృష్ణ చెప్పారు. ప్రస్తుతం సెమీకండక్టర్ల సంబంధ విధులు నిర్వర్తిస్తున్న సుమారు 400 మంది సిబ్బందిని, కొత్త కంపెనీకి బదలాయించనున్నట్లు తెలిపారు. కొత్త సంస్థను స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ చేసే యోచన ఉన్నట్లు కృష్ణ పేర్కొన్నారు. సెమీకండక్టర్‌ వ్యవస్థలో భారత్‌ స్వావలంబన సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)