Breaking News

ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లో ఎందుకింత ఒత్తిడి?

Published on Wed, 12/17/2025 - 13:22

డిజిటల్ స్వీకరణ, నియంత్రణ మార్పులు, విదేశీ పెట్టుబడులు భారత బీమా రంగాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అయాన్‌ (Aon) విడుదల చేసిన ‘గ్లోబల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఇన్‌సైట్స్ రిపోర్ట్’ ప్రకారం.. కొన్ని విభాగాల్లో కొనుగోలుదారులకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, సైబర్, ప్రాపర్టీ బీమాల్లో ఒత్తిడి పెరుగుతోంది.

చాలా బీమా విభాగాలు ఇప్పటికీ “సాఫ్ట్ మార్కెట్”లో ఉన్నాయి. అంటే పోటీ ధరలు  విస్తృత కవరేజ్ లభిస్తున్నాయి. అయితే, సైబర్ బీమాలో క్లెయిమ్స్ సంఖ్య, వ్యయం గణనీయంగా పెరగడంతో బీమా సంస్థలు కఠిన అండరైటింగ్ విధానాలు, అధిక డిడక్టిబుల్స్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్ కారణంగా సైబర్ బీమా అత్యధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగంగా మారింది.

ప్రాపర్టీ బీమాలో 2025లో అమలులోకి వచ్చిన క్వాసీ-టారిఫ్ ధర విధానాలు డబుల్ డిజిట్ ప్రీమియం పెరుగుదలకు దారితీశాయి. దీంతో ఖర్చు తగ్గించుకునే అవకాశాలు కొనుగోలుదారులకు తగ్గాయి. మరిన్ని రీ-ఇన్సూరెన్స్ సంస్థలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ఈ విభాగంలో అస్థిరత కొనసాగనుంది.

ఇదిలా ఉండగా, భారత బీమా మార్కెట్లో సామర్థ్యం పెరుగుతోంది. కొత్త బీమా సంస్థలు, విదేశీ రీ-ఇన్సూరర్లు ప్రవేశించడం, అలాగే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల పోటీ, ఆవిష్కరణలు పెరిగాయి.

ఈ పరిణామాలపై స్పందించిన అయాన్‌ ఇండియా చీఫ్ బ్రోకింగ్ ఆఫీసర్ శాంతనూ సక్సేనా.. “2025లో భారత బీమా మార్కెట్ వేగంగా ఎదుగుతున్న, అవకాశాలతో నిండిన వాతావరణాన్ని చూపిస్తోంది. ఇది కొనుగోలుదారులకు మరింత ఎంపికలను అందిస్తోంది” అని పేర్కొన్నారు.

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)