Breaking News

ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్న వారికి షాక్‌! డిస్కౌంట్‌ డబ్బు వెనక్కి కట్టాలి?

Published on Sun, 07/30/2023 - 20:41

సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ (Electric Two wheeler)  కంపెనీల నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్‌ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్‌2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్‌ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.  ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది.

ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లలో వర్తింపు 

హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఇంపోర్టెడ్‌ పార్ట్స్‌ వినియోగం
ఫేమ్‌2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్‌లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్‌లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది.

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్‌2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్‌ పథకానికి కొనసాగింపు.
 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?