Breaking News

బ్రాండెడ్‌ హోటల్స్‌కు భలే డిమాండ్‌

Published on Fri, 12/27/2024 - 12:35

బ్రాండెడ్‌ హోటల్స్‌లో విడిది చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. డిమాండ్‌ బలంగా ఉండడంతో  బ్రాండెడ్‌ హోటల్స్‌(Hotels) పరిశ్రమ ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–12 శాతం మేర అధికంగా నమోదవుతుందని క్రిసిల్‌(Crisil) రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. దేశీయంగా విహార, వ్యాపార ప్రయాణాలు ప్రధానంగా బ్రాండెడ్‌ హోటళ్ల డిమాండ్‌ను పెంచుతున్నాయని, ఇక ఎంఐసీ విభాగంలో (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) వృద్ధి, విదేశీ పర్యాటకుల సందర్శనలు పుంజుకోవడం పరిశ్రమ ఆదాయానికి మద్దతునివ్వనున్నట్టు వివరించింది.

బ్రాండెడ్‌ హోటల్స్‌ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం సైతం 17 శాతం మేర వృద్ధిని నమోదు చేయడాన్ని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక ప్రస్తావించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి హోటళ్లలో రూమ్‌ల పెరుగుదల వేగాన్ని అందుకున్నట్టు తెలిపింది. అస్సెట్‌ లైట్‌ (సొంతంగా కాకుండా లీజు విధానంలో) నమూనాలో ఇక ముందూ కొత్త గదుల చేరిక వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది. దీంతో ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద  కొత్త గదుల లభ్యత 20 శాతం మించుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–9 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరాలో 11–12 శాతం మేర కొత్త గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. బ్రాండెడ్‌ హోటళ్ల నిర్వహణ మార్జిన్‌ 100–150 బేసిస్‌ పాయింట్లు మేర ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మెరుగుపడుతుందని అంచనా వేసింది. బలమైన నగదు ప్రవాహాలు, అస్సెట్‌ లైట్‌ నమూనాలో విస్తరణ, తగినంత మూలధనం సమీకరణతో బ్రాండెడ్‌ హోటళ్ల రుణ భారం నియంత్రిత స్థాయిలోనే కొనసాగుతుందని పేర్కొంది. ఇది ఆయా హోటళ్ల రుణ పరపతిని బలోపేతం చేస్తుందని తెలిపింది.

రూమ్‌ రేట్లు అప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాండెడ్‌ హోటళ్ల సగటు రూమ్‌ రేట్లు (ARR) 6–7 శాతం మేర పెరుగుతాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. కాకపోతే వచ్చే ఏడాది 3–4 శాతం పెరుగుదలకు పరిమితం అవుతుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో అదనపు గదులు అందుబాటులోకి రావడం ఇందుకు కారణంగా తెలిపింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11–12 శాతం చొప్పున ఆదాయంలో వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. విహార, వ్యాపార పర్యటనల్లో ఏడు ప్రధాన నగరాలు 25 శాతం వాటా ఆక్రమిస్తాయని.. మిగిలిన మేర ఆధ్యాత్మిక పర్యాటక రూపంలో ఉంటుందని తెలిపింది.

ఇదీ చదవండి: నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధి

ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందంటే..

‘నాన్‌ మెట్రో(Non Metro) నగరాల్లో, విహార గమ్యస్థానాల్లో హోటల్‌ పరిశ్రమ కార్యకలాపాలు ఎక్కువగా విస్తరణకు నోచుకుంటున్నాయి. దీంతో కొత్త గదుల చేరికలో 60–65 శాతం మేర ఇక్కడే ఉండనుంది. అది కూడా అస్సెట్‌ లైట్‌ నమూనాలో కావడంతో, పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం కూడా ఉండదు’ అని క్రిసిల్‌ రేటింగ్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పల్లవి సింఘ్‌ తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త గదులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, అదే సమయంలో ఆక్యుపెన్సీ (రూముల వినియోగం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 74–75 శాతం స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అది ఈ ఏడాది కంటే 1–1.5% తక్కువగా ఉంటుందని పేర్కొంది. వ్యయాలను సమర్థవంతంగా నియంత్రించడం, టెక్నాలజీ, మానవ వనరుల మెరుగైన వినియోగం, అస్సెట్‌ లైట్‌ విధానం ఫలితంగా పరిశ్రమ ఎబిటా మార్జిన్‌ 1–1.5% పెరిగి 2024–25లో 33–34 శాతానికి చేరవచ్చన్నది క్రిసిల్‌ అంచనా.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)