Breaking News

దేశీ వినియోగమే జీడీపీకి బూస్ట్‌

Published on Tue, 09/02/2025 - 08:37

దేశీ డిమాండ్‌ పుంజుకోవడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకునేలా చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నామినల్‌ జీడీపీ మాత్రం జూన్‌ క్వార్టర్‌లో 8.8 శాతానికి తగ్గిందని, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 10.8 శాతంగా ఉన్నట్టు క్రిసిల్‌ ఆర్థికవేత్తల బృందం పేర్కొంది.

‘దేశీ ప్రైవేటు వినియోగం బలపడింది. ఇది తయారీ, సేవల రంగానికి ఊతమిచ్చింది. మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం మూలధన వ్యయాలను పెద్ద మొత్తంలో పెంచిది. ఇది సైతం ప్రభుత్వ వినియోగ వ్యయాన్ని పెంచింది’ అని క్రిసిల్‌ ఆర్థిక బృందం తెలిపింది. స్థూల విలువ జోడింపు (జీవీఏ) క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఉన్న 6.8 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. గ్రామీణ డిమాండ్‌ ప్రైవేటు వినియోగం పెరిగేందుకు దోహదం చేసి ఉండొచ్చని అభిప్రాయపడింది.  

సవాళ్లలోనూ పటిష్ట పనితీరు..

అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు నెలకొన్న తరుణంలో భారత జీడీపీ రికార్డు స్థాయిలో 7.8 శాతంగా నమోదు కావడం ప్రశంసనీయమని ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌ పురి పేర్కొన్నారు. గత ఐదు త్రైమాసికాల్లోనే ఇది గరిష్ట రేటు అని గుర్తు చేశారు. వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో అన్ని రంగాల్లో అవకాశాల విస్తరణకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులతో తన నిర్వహణలోని అన్ని వ్యాపారాల విస్తరణకు, విలువ జోడింపునకు ఐటీసీ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)