Breaking News

భారత వృద్ధి రేటు అంచనాలు పెంపు.. ఎంతంటే..

Published on Tue, 12/02/2025 - 09:08

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో భారత వృద్ధి రేటు అంచనాను ఏడు శాతానికి పెంచుతున్నట్లు ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తెలిపింది. అంతకుముందు 6.5% వృద్ధిని అంచనా వేసింది. 2025–26 ప్రథమార్ధంలో దేశీయ వృద్ధి రేటు అంచనాలకు మించి 8% వృద్ధి సాధించిన నేపథ్యంలో వృద్ధి అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. భారత వాస్తవ జీడీపీ వృద్ధి రెండో త్రైమాసికంలో 8.2 శాతంగా నమోదై, అంచనాలను మించిందని క్రిసిల్‌ ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు.

ద్రవ్యోల్బణం దిగిరావడంతో నామినల్‌ జీడీపీ లేదా ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి మోస్తారు స్థాయిలో 8.7%గా నమోదైంది. అమెరికా సుంకాల విధింపు ప్రభావంతో 2025–26 ద్వితీయార్ధంలో వృద్ధి 6.1 శాతానికి పరిమితం కావొచ్చని జోషి అంచనా వేశారు. ‘‘ప్రైవేటు వినియోగం వాస్తవ జీడీపీ వృద్ధికి ప్రధాన ఇంధనంగా నిలిచింది. సప్లై దృష్టి కోణంలో తయారీ, సేవల రంగాల్లో వృద్ధి గణనీయంగా పెరిగింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గడంతో స్వచ్ఛంద వినియోగ వ్యయం ఊపందుకుంది. మూడో క్వార్టర్‌లో ఈ అనుకూల పరిస్థితులు కలిసొస్తాయి. ప్రభుత్వ పెట్టుబడుల్లో స్థిరత్వం కొనసాగే వీలుంది. ప్రైవేటు పెట్టుబడులు ఆలస్యమైనప్పట్టకీ.., క్రమంగా పెరగొచ్చు’’ అని జోషి అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: తయారీపై ‘టారిఫ్‌ల’ ప్రభావం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)