ఆ రాత్రంతా ఏడ్చాను.. చివరకు కాగ్నిజెంట్‌లో జాబ్!

Published on Wed, 06/17/2026 - 15:47

ప్రతి విజయం వెనుక ఎన్నో కష్టాలు, నిరాశలు, తిరస్కరణలు దాగి ఉంటాయి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అంటారు చెన్నైకు చెందిన మహేశ్వరి మోహన్. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సక్సెస్ జర్నీ ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మహేశ్వరి మోహన్‌ చదువుకునే రోజుల్లోనే కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేయాలని కలలు కనింది. 2022లో తన కాలేజీ క్యాంపస్ డ్రైవ్ సమయంలో కాగ్నిజెంట్ తనను మొదటిసారి తిరస్కరించింది. కలలు కన్న కంపెనీ రిజెక్ట్ చేయడంతో 'ఆ రాత్రంతా నేను ఏడ్చాను' అని ఆమె తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.

కాగ్నిజెంట్ కంపెనీ రిజెక్ట్ చేసిందని, మహేశ్వరి అక్కడితో ఆగిపోలేదు. మరోసారి 2023 జూన్‌లో జరిగిన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరై మళ్లీ చివరి రౌండ్ వరకు చేరుకున్నారు. కానీ మరోసారి తిరస్కరణ ఎదురైంది. దీంతో ఆమె తనను తాను ప్రశ్నించుకుంది, తనకు కాగ్నిజెంట్‌లో పనిచేయడానికి కావాల్సిన సామర్థ్యం లేదని భావించింది.

అలాంటి సమయంలో.. 2023 నవంబర్‌లో హెచ్‌సీఎల్‌టెక్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్కడ పనిచేయడమే తన కెరీర్‌లో ఒక కీలక మలుపుగా మారిందని మహేశ్వరి చెప్పారు. సంస్థలో కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నారు, అనుభవం సంపాదించారు, వృత్తిపరంగా ఎంతో ఎదిగారు. అయినప్పటికీ కాగ్నిజెంట్‌లో చేరాలనే కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.

ఇదిలా ఉండగా.. 2026 ఏప్రిల్‌లో అనుకోకుండా కాగ్నిజెంట్ రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. రియల్ టైమ్ అనలిస్ట్ (RTA) పోస్టుకు అవకాశం ఉందని తెలియజేశారు. ఈసారి మహేశ్వరి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. అన్ని ఇంటర్వ్యూ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి ఎంపికయ్యారు. చివరకు 2026 జూన్‌లో కాగ్నిజెంట్‌లో చేరి తన నాలుగేళ్ల కలను సాకారం చేసుకున్నారు.

తన విజయాన్ని వివరిస్తూ ఆమె ''2022లో ఫ్రెషర్‌గా ఉన్నప్పటికంటే.. ఇప్పుడు నేను పది రెట్లు ఎక్కువగా సిద్ధంగా ఉన్నాను'' అని చెప్పారు. జీవితంలో కొన్ని అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, అవి మన ఎదుగుదలకు అనుకూలంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒకసారి లేదా రెండుసార్లు విఫలమైనా ప్రయత్నాన్ని ఆపకూడదు. ప్రతి తిరస్కరణ మనల్ని మరింత బలంగా, అనుభవజ్ఞులుగా తయారు చేస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు విజయం తప్పకుండా లభిస్తుందని మహేశ్వరి కథ కళ్ళకు కట్టినట్లు చెబుతుంది.

ఇదీ చదవండి: డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో..

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)