Breaking News

భారత్‌ క్రెడిట్‌ రేటింగ్‌కు సవాళ్లు

Published on Wed, 01/22/2025 - 08:36

భారత్‌ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు 2025లో క్రెడిట్‌ రేటింగ్‌కు సవాళ్లను విసిరే అవకాశం ఉందని మూడీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే అమెరికా–చైనా సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు భారత్‌ ఎకానమీకి కలిసి వచ్చే వీలుందని కూడా నివేదిక వివరించింది. ఆసియా పసిఫిక్‌ సావరిన్స్‌పై  రేటింగ్స్‌ దిగ్గజం నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే..

  • వృద్ధి – ద్రవ్యోల్బణం  మధ్య సమతౌల్యం ఏర్పడుతోంది. ప్రపంచ, ప్రాంతీయ ఆర్థిక పరిస్థితుల్లో కొంత సరళతర పరిణామాలు నెలకొన్నాయి. భారత్‌ దేశీయ డిమాండ్‌కు ఆయా అంశాలు బలాన్ని చేకూర్చుతున్నాయి.  

  • అమెరికా ప్రతిపాదిత వాణిజ్య రక్షణాత్మక చర్యలు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో  ఎకానమీ ఉత్పత్తి విస్తృత స్థాయిలో బలహీనపరవచ్చు.  

  • భారత్‌లో ద్రవ్యలోటు సవాళ్లు క్రమంగా తగ్గుముఖం పడతాయని మేము విశ్వసిస్తున్నాం.  

  • మూడీస్‌ బీఏఏ– రేటింగ్‌లో ఉన్న తోటి దేశాలతో పోలి్చతే భారత్‌ రుణ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో రెవెన్యూ పెరిగినప్పటికీ సవాళ్లు కొనసాగుతున్నాయి.  

ఇదీ చదవండి: ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీ

  • తైవాన్‌ జలసంధి లేదా కొరియన్‌ ద్వీపకల్పంలో సైనిక సంఘర్షణల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంపై ప్రతికూలత చూపుతాయి.ఈ ఉద్రిక్తతలు వాణిజ్యం, పెట్టుబడిఅంశాలపైప్రభావ చూపిస్తాయి.  

  • వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులను అమెరికా కఠినతరం చేస్తే, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడవచ్చు. ఇది ప్రాంతీయ వృద్ధిని దెబ్బతీయవచ్చు. అయితే ఇది  భారత్, కొన్ని ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

  • భౌగోళిక, ప్రాంతీయ రాజకీయ సవాళ్లు పలు దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలా లేక ద్రవ్య లోటు కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలా? అన్న అంశాలపై ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)