Breaking News

క్రెడిట్‌ కార్డులపై కొత్త చార్జీలు.. డిసెంబర్‌ 20 నుంచి..

Published on Sun, 11/24/2024 - 11:46

దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ వచ్చే డిసెంబర్‌ నెల నుండి తన క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో అనేక మార్పులు చేయబోతోంది. వీటిలో కొత్త రిడెంప్షన్ ఫీజులు, సవరించిన వడ్డీ రేట్లు, అదనపు లావాదేవీ ఛార్జీలు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 20 నుండి అమలుకానున్నాయి.

ఎడ్జ్‌ రివార్డ్‌లపై రిడెంప్షన్ ఫీజు
యాక్సిస్‌ బ్యాంక్ ఎడ్జ్‌ రివార్డ్‌లు లేదా మైల్స్‌ను వినియోగించడం కోసం రిడెంప్షన్ ఫీజులను ప్రవేశపెడుతోంది. క్యాష్‌ రిడెంప్షన్‌కు రూ. 99 (18 శాతం జీఎస్టీ అదనం), మైలేజ్ ప్రోగ్రామ్‌కు పాయింట్లను బదిలీ చేయడానికి రూ. 199 (18 శాతం జీఎస్టీ అదనం) వసూలు చేయనుంది. డిసెంబర్ 20 లోపు పాయింట్‌లను రీడీమ్ లేదా బదిలీ చేసుకుంటే ఈ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు.

రిడెంప్షన్ ఫీజు వర్తించే కార్డులు ఇవే..
» యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ క్రెడిట్ కార్డ్
» శామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిట్‌ క్రెడిట్ కార్డ్
» శామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
» యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ 
» యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్

సవరించిన ఇతర ఛార్జీలు
నెలవారీ వడ్డీ రేటు 3.75 శాతానికి పెరుగుతుంది. ఆటో డెబిట్ రివర్సల్, చెక్ రిటర్న్‌పై  చెల్లింపు మొత్తంలో 2 శాతం రుసుము ఉంటుంది. కనిష్ట పరిమితి రూ. 500 కాగా గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు. దీంతో శాఖలలో నగదు చెల్లింపుపైనా రూ.175 రుసుము  చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ట బకాయి మొత్తాన్ని చెల్లించడంతో వరుసగా రెండు సార్లు విఫలమైతే రూ. 100 అదనపు రుసుము విధిస్తారు.

ఇదీ చదవండి: కొత్త క్రెడిట్‌ కార్డ్‌.. లైఫ్‌ టైమ్‌ ఫ్రీ!

ఇక డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) మార్కప్‌ను డీసీసీని 1.5 శాతానికి సవరించారు. అద్దె చెల్లింపులపై 1 శాతం రుసుము  చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం, క్రెడ్‌, గూగుల​్‌ పే వంటి ఏదైనా థర్డ్-పార్టీ యాప్ ద్వారా విద్యా రుసుము చెల్లిస్తే 1 శాతం రుసుము ఉంటుంది. అయితే, విద్యా సంస్థలకు నేరుగా చెల్లించే చెల్లింపులకు మినహాయింపు ఉంటుంది.

రూ. 10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడ్‌పై 1% రుసుము చెల్లించాలి. ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ. 50,000 కంటే ఎక్కువ ఇంధన ఖర్చులు, రూ. 25,000 లకు మించిన యుటిలిటీ, రూ. 10,000 కంటే ఎక్కువ గేమింగ్ లావాదేవీలు ఉంటే 1% రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)