Breaking News

ఫుడ్‌ ఆర్డర్‌లో నిర్లక్ష్యం.. జొమాటోకు రూ.60 వేల జరిమానా

Published on Mon, 07/15/2024 - 15:37

జొమాటో, స్విగ్గీ వంటివి అందుబాటులో వచ్చిన తరువాత కావలసిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఉన్న చోటుకే తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే ఈ సర్వీసుల్లో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి ఘటన ఇటీవల కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. దీనిని విచారించిన కోర్టు జొమాటోకు రూ. 60వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన శీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న జొమాటోలో మోమోస్ ఆర్డర్ చేశారు. దీనికి 133 రూపాయలు గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఆర్డర్ పెట్టిన 15 నిమిషాల తరువాత డెలివరీ అయినట్లు జొమాటో యాప్ చూపించింది. నిజానికి ఆమెకు మోమోస్ డెలివరీ కాలేదు.

ఆర్డర్ పెట్టిన మోమోస్ డెలివరీ కాకపోవడంతో రెస్టారెంటుకు కాల్ చేయగా, డెలివరీ ఏజెంట్ ఆర్డర్ తీసుకున్నారని, ఇతర వివరాలు కోసం డెలివరీ ఏజెంట్‌ను సంప్రదించమని వెల్లడించారు. అయితే ఏజెంట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ అతను స్పందించలేదు. దీంతో శీతల్ జొమాటోకు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రతిస్పందన కోసం 72 గంటల పాటు వేచి ఉండాల్సిందిగా కంపెనీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. అయినా శీతల్‌‌‌‌ను ఎలాంటి రిప్లై అందలేదు.

ఇదీ చదవండి: పెరిగిన ఎస్‌బీఐ వడ్డీ రేట్లు: ఈ రోజు నుంచే అమలు..

జొమాటో నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 2023 సెప్టెంబర్ 13న కంపెనీకి లీగల్ నోటీసు పంపించారు. నోటీసుకు ప్రతిస్పందనగా, కోర్టుకు హాజరైన జొమాటో తరపు న్యాయవాది ఈ ఆరోపణ తప్పు అని పేర్కొన్నారు. ఆ తరువాత పొంతనలేని సమాధానాల ఆధారంగా కోర్టు తీర్పునిస్తూ.. జొమాటో నిర్లక్ష్యం వల్ల మహిళ మానసిక వేదనకు గురైందని.. దీనికి పరిహారంగా రూ. 50000, కేసు.. ఇతర ఖర్చుల కారణంగా మరో పదివేలు.. ఇలా మొత్తం జొమాటోకు రూ. 60000 జరిమానా విధించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)