Breaking News

బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సింది..

Published on Mon, 05/27/2024 - 10:45

బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్‌ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని నమ్మేవారు. అలాంటి బిల్‌ గేట్స్‌.. అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. వారెన్‌ బఫెట్‌ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెబుతున్నారు..

"విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్‌లోని ప్రతి సెకనును నింపాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్‌లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలించి ఉంటే ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రోమేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్‌ రిక్వెస్ట్‌లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని ఈ విధానమే విజయానికి మార్గమని ఆయన గతంలో విశ్వసించారు. అయితే, బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు.

"వారెన్ తన క్యాలెండర్‌ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు అతనికి ఉన్నాయి" అని బిల్ గేట్స్ అన్నారు. బఫెట్ షెడ్యూల్ తనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందన్నారు. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. బఫెట్ భావన ఏంటంటే "కష్టపడి కాదు.. తెలివిగా పనిచేయండి". సైన్స్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.

'ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు అంతకాలం వేచి ఉండవద్దు' అని ఆయన అన్నారు. "ఇష్టమైనవారితో బంధాలను పెంపొందించుకోవడానికి, సక్సెస్‌ను ఆనందించడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోండి. అవసరమైనప్పుడు విరామం తీసుకోండి" అని బిల్‌ గేట్స్‌ సూచిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)