Breaking News

సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ అద్దె రూ.1.2 లక్షలు! ఎక్కడంటే..

Published on Sun, 06/18/2023 - 22:20

దేశంలోని ఖరీదైన ప్రాంతాలలో అపార్ట్‌మెంట్‌ల అద్దెలు లక్షల రూపాయలు ఉండటం సహజం. అయితే అలాంటి అపార్ట్‌మెంట్‌లు విలాసవంతంగా, విశాలంగా ఉంటాయి. కానీ ముంబైలోని ఓ సింగిల్‌ బెడ్ రూమ్ ఫ్లాట్ ఆ ఆలోచనను తారుమారు చేసింది.

ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని కార్మైకేల్ రోడ్‌లో ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన వీధుల్లో ఇది ఒకటి. ఇక్కడ నివాసమంటున్నవారంతా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ వన్‌ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అద్దెకుంటున్నది కుష్ భయాని అనే ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్‌హాస్‌ అనే స్థిరాస్థి సంస్థ సహ వ్యవస్థాపకుడు. 

వందేళ్ల నాటిది!
ఈ వన్‌ బీహెచ్‌కే సాధారణ సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ లాంటిది కాదు. ఇది 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే ముంబైలో సగటు వన్‌ బీహెచ్‌కే కంటే పరిమాణంలో రెండింతలు పెద్దది. పైకప్పు కూడా చాలా ఎత్తులో ఉంది. చేతితో పెయింట్ చేసిన అందమైన టైల్ ఫ్లోర్‌ ఉన్న ఈ ఫ్లాట్‌ సుమారు 100 సంవత్సరాల నాటిదని ఇందులో అద్దెకుంటున్న కుష్ భయాని చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం, సహజ కాంతిని అందించేలా దీన్ని నిర్మించారు. బాత్రూమ్‌ను సైతం గ్రీకు సౌందర్యంతో రూపొందించారు. లివింగ్‌ రూమ్‌ కంటే బెడ్ రూమ్ పెద్దదిగా మరో విశేషం. ఈ ఫ్లాట్‌ ముంబైలో గోవా అనుభూతిని ఇస్తుందని, అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు కుష్ భయాని పేర్కొంటున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)