Breaking News

ఇళ్లకు కూల్‌ రూఫ్‌ వేసుకుంటే సరి..

Published on Sun, 03/30/2025 - 15:11

రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇంటి లోపల వేడి, ఉక్కపోత పెరిగిపోతోంది. దీంతో బయటే కాదు ఇంట్లోనూ ఉండలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇళ్లంతా చల్లగా ఉంటే ఆ హాయి వేరే కదూ.. అయితే పైకప్పులో కూల్‌ రూఫ్‌ టైల్స్, పెయింటింగ్స్‌ వేసుకుంటే సరి. సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని రాకుండా నిరోధించే శక్తి ఉండటం వీటి ప్రత్యేకత. పట్టణీకరణ, కాంక్రీట్‌ జంగిల్‌ కారణంగా నగరాలలో అర్బన్‌ హీట్‌ ఐల్యాండ్‌ (యూహెచ్‌ఐ) ప్రభావం ఏర్పడుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. –సాక్షి, సిటీబ్యూరో

వేసవి కాలంలో వేడి గాలులతో 32 కోట్ల మంది భారతీయులు అధిక ప్రమాదకర పరిస్థితులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చెట్ల పెంపకం, వేడి, కాలుష్యాన్ని తగ్గించే ఆచరణీయ పద్ధతులు ఉన్నప్పటికీ ప్రపంచ నగరాలు కూల్‌ రూఫ్, గ్రీన్‌ బిల్డింగ్‌ వంటి వినూత్న పరిష్కార మార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టొరంటో వంటి అంతర్జాతీయ నగరాలు కూల్‌ రూఫ్‌ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ గణనీయమైన పర్యావరణ ప్రయోజనాలను పొందుతున్నాయి. ఇదే తరహాలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనూ ‘కూల్‌ రూఫ్‌ పాలసీ’ని అమలులోకి తీసుకొచ్చింది.  

కూల్‌ ఉంటేనే ఓసీ.. 
మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర నివాస, వాణిజ్య భవనాలకు కూల్‌ రూఫ్‌ తప్పనిసరి. 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలోని నివాస భవనాలకు కూల్‌ రూఫ్‌ ఉండాల్సిందే. అంతకంటే చిన్న ఇళ్లు స్వచ్ఛందంగా స్వీకరించవచ్చు. ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతి ప్రక్రియలో కూల్‌ రూఫ్‌ విధానాన్ని మిళితం చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) జారీ చేసేందుకు సంబంధిత అధికారులు కూల్‌ రూఫ్‌లను నిర్ధారించుకున్నాకే ఓసీ జారీ చేస్తారు. కూల్‌ రూఫ్‌ పాలసీ అమలుతో ఐదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు 12 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతోందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఎంత ఖర్చవుతుందంటే.. 
కూల్‌ రూఫ్‌ టైల్స్‌ను జిర్కోనియం సిలికేట్, జింక్‌ ఆక్సైడ్‌ల నానోమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న కణాల మిశ్రమాలను అల్యూమీనియం సిలికెట్‌ కణాలతో కూడిన ప్రత్యేక గ్లేజ్‌తో తయారు చేస్తారు. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాలుస్తారు. దీంతో వీటికి సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని చేరనివ్వదు. కూల్‌ రూఫ్‌ ఏర్పాటుకు రకాన్ని బట్టి చ.అ.కు రూ.120–1,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రత్యేకమైన పెయింటింగ్‌లు లేదా నిర్ధిష్ట సిరామిక్‌ టైల్స్‌తో తయారైన కూల్‌ రూఫ్‌లు ఉన్నాయి.  

ఏసీ వినియోగం తక్కువ.. 
సంప్రదాయ పైకప్పుతో పోలిస్తే కూల్‌ రూఫ్‌లు తక్కువ సౌరశక్తిని గ్రహిస్తాయి. ఇవి సూర్యరశ్మిని తక్కువగా గ్రహించి, ఇంట్లోకి వేడిని వెళ్లనివ్వదు. దీంతో ఇంట్లో ఏసీ, కూలర్ల వినియోగం తక్కువగా ఉంటుంది. సంప్రదాయ పైకప్పులతో పోలిస్తే కూల్‌ రూఫ్‌ పైకప్పు ఉన్న ఇంటిలోపల గది ఉష్ణోగ్రతలు 5–9 డిగ్రీలు తక్కువగా ఉంటాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)