Breaking News

పండుగ సీజన్‌లో వాటి కొనుగోళ్లకే మొగ్గు.. డెలాయిట్‌ సర్వే సంచలన రిపోర్ట్!

Published on Sat, 09/23/2023 - 07:09

న్యూఢిల్లీ: ప్రస్తుత పండుగల సీజన్‌లో వినియోగదారులు అధిక వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు డెలాయిట్‌ సర్వే వెల్లడించింది. లగ్జరీ, సెలబ్రేటరీ (వేడుకలకు సంబంధించి) వస్తువుల కొనుగోలు పెరగడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఊహించని పెద్ద మొత్తంలో ఖర్చులు వచ్చినా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ‘డెలాయిట్‌ కన్జ్యూమర్‌ సిగ్నల్‌ రీసెర్చ్‌’ సర్వేలో సగం మంది చెప్పారు.

‘‘భారత్‌లో పండుగల సీజన్‌ సమీపిస్తోంది. దీంతో వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతోంది. 56 శాతం మంది వేడుకలకు సంబంధించిన (పుట్టిన రోజు, వివాహం తదితర) వస్తువులు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు’’అని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. సమీప కాలంలో వస్త్రాలు, వ్యక్తిగత సంరక్షణ, వినోదం, విహారంపై వ్యయాలు పెరగొచ్చని తెలిపింది. 

భారత ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని సాధిస్తుండడంతో, వినియోగదారులు విలాస వస్తువులు, ఖరీదైన వస్తువుల కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నట్టు డెలాయిట్‌ ఆసియా పసిఫిక్‌ పార్ట్‌నర్‌ రాజీవ్‌సింగ్‌ పేర్కొన్నారు. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, రవాణా, ఆతిథ్యానికి కూడా ఇదే ధోరణి విస్తరిస్తున్నట్టు చెప్పారు. టైర్‌ 2, 3 పట్టణాల్లోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్టు తెలిపారు. 

విచక్షణారహిత వినియోగం పెరగనుందని, దీంతో రిటైల్, ఆటోమోటివ్, రవాణా, ఆతిథ్య రంగాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. భారత వినియోగదారులు కేవలం విలావవంతమైన కొనుగోళ్లకే పరిమితం కావడం లేదని, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్‌ నివేదిక తెలిపింది. ఇందుకు నిదర్శంగా దేశీయ, అంతర్జాతీయ విమాన బుకింగ్‌లను పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)