Breaking News

చైనా కంపెనీ ముక్కు పిండి వసూలు చేశాడు

Published on Sat, 01/20/2024 - 14:43

గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని కంపెనీలు కస్టమర్లకు జరిగిన నష్టాన్ని రీప్లేస్ చేయగా.. మరో కొన్ని కంపెనీలు ఊరుకున్నాయి. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి కోర్టుకెళ్లి నష్ట పరిహారంగా రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు.

తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2021 ఏప్రిల్ 7న సంస్థకు చెందిన డీలర్‌ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుండేవాడు. అతడు రోజూ మాదిరిగానే 2023 ఫిబ్రవరి 26న కూడా ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ స్కూటర్ పేలిపోయి మొత్తం కాలిపోయింది. మంటల వల్ల పొగలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడంతో వినియోగదారుడు మాత్రమే కాకుండా.. అతని కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురైందని తెలిపాడు. జరిగిన నష్టం గురించి సంబంధిత డీలర్‌కు వెల్లడించారు. దీంతో కంపెనీ ప్రతినిధి కస్టమర్‌ను సంప్రదించి, కాలిన స్కూటర్ ఫోటోలను సేకరించుకున్నారు.

ఇదీ చదవండి: ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్‌బీఐ - ఎందుకంటే?

ఎన్ని రోజులకూ కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో విసుగు చెందిన కస్టమర్ తమ లాయర్ ద్వారా తయారీదారు, డీలర్‌తో సహా ఇరువర్గాలకు నోటీసులు అందజేసింది. అయితే వీరిద్దరూ కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో కోర్టు డీలర్‌ నిర్లక్ష్యానికి, వెహికల్ తయారీలో నాసిరకమైన పరికరాలను ఉపయోగించిన కారణంగా కంపెనీకి.. రూ.10 లక్షల జరిమానా, ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా స్కూటర్ ధరను కస్టమర్‌కు చెల్లించాలని లేదా స్కూటర్‌ను భర్తీ చేయాలని కూడా ఆదేశించింది.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)