Breaking News

అనిశ్చితులున్నా ఎగుమతులు మిన్న

Published on Fri, 03/28/2025 - 07:37

ప్రపంచ వాణిజ్యం, టారిఫ్‌లపై అనిశ్చితులున్నప్పటికీ రానున్న కాలంలో భారత్‌ నుంచి ఎగుమతులు వృద్ధి పథంలోనే సాగనున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ సంతోష్‌ కుమార్‌ సారంగి పేర్కొన్నారు. అయితే ఇందుకు ఎగుమతిదారులు వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యూహాత్మకంగా విచక్షణతో వ్యవహరించవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వాతావరణం భారత్‌కు బంగారంలాంటి అవకాశాలను కల్పిస్తుందని తెలియజేశారు.

తయారీలో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు.. ఎగుమతులు పుంజుకునేందుకు వైవిధ్యాన్ని చూపవలసి ఉంటుందని దేశీ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈవో) ఏర్పాటు చేసిన సోర్సెక్స్‌ ఇండియా 2025 షోలో సంతోష్‌ వివరించారు. చైనా తదితర దేశాలపై యూఎస్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 2 నుంచి వీటిని భారత్‌కు సైతం వర్తింపచేయనున్నారు. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో కొన్ని ఎగుమతి సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్‌కు ప్రధానంగా ఇంజినీరింగ్, ఫార్మా ఎగుమతులు దెబ్బతినవచ్చని కొన్ని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: భాగ్యనగరంలో రియల్టీ ఎలా ఉందంటే..

ప్రస్తుత ఏడాదిలో భారత్‌ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లను దాటనున్నట్లు సంతోష్‌ పేర్కొన్నారు. గతేడాది ఇవి 778 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు తెలియజేశారు. ఇటీవల కొద్ది నెలలుగా ఎగుమతుల్లో మందగమనం నెలకొన్నప్పటికీ దీర్ఘకాలంలో పుంజుకోగలవని అభిప్రాయపడ్డారు. ఆర్డర్లపై పెరుగుతున్న విచారణలు సానుకూల అంచనాలకు దారి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి భవిష్యత్‌లో ఎగుమతులు వృద్ధి బాటలో సాగగలవని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)